vishnu priya facebook hacked
mictv telugu

విష్ణుప్రియ ఫేస్‌బుక్‎లో అశ్లీల వీడియోలు ప్రత్యక్షం

November 2, 2022

vishnu priya facebook hacked

హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. సెలబ్రెటీల సోషల్ మీడియా అకౌంట్లను టార్గెట్ చేస్తూ వారికి షాక్ ఇస్తున్నారు. తాజాగా హ్యాకర్ల కన్ను బుల్లితెర యాంకర్ విష్ణుప్రియపై పడింది. ఆమె ఫేస్ బుక్ ను హ్యాక్ చేసి నానా రచ్చ చేసారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్లలో అశ్లీల వీడియోలు ప్రత్యక్షమవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది.

స్నేహితులు, బంధువులు ఫోన్ చేసి చెప్పడంతో తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని విష్ణుప్రియ తెలుసుకుని జాగ్రత్తపడింది. అయితే ఎవరో తన అకౌంట్ హ్యాక్ చేసి ఈ వీడియోలను పోస్ట్ చేసినట్లు ఆమె పేర్కొంది.ఈ విషయాన్ని అందరికీ తెలియజేయమని తెలిపింది.అయితే ఇదే మొదటి సారి కాదు గతంలో కూడా విష్ణుప్రియ ఫేస్‌బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసి ఇలాంటి పనులే చేసారు.మళ్లీ ఇప్పడు రిపీట్ అవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అకౌంట్ డిలీట్ చేయమని కొందరు సూచిస్తుంటే..సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించాలని మరికొందరు సలహాలు ఇస్తున్నారు.

బుల్లితెరపై హాట్ యాంకర్‌గా గుర్తింపు పొంది తన అందాలతో మతిపోగొట్టిన విష్ణుప్రియ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తన యాంకరింగ్‌తో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకొని ముందుకు దూసుకుపోతుంది. . ఈ క్రమంలో సినిమాల్లో కూడా అవకాశాలు సంపాదించుకుంటుంది. ఈ బ్యూటీ ఇటీవల ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలో నటించి.. అందాలు ఆరబోసింది. గతంలో కూడా కొన్ని సినిమాలో నటించి అలరించింది విష్ణుప్రియ.