భర్త న్యూడ్ ఫోటోలను తీసిన గుత్తా జ్వాల.. నెట్టింట వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

భర్త న్యూడ్ ఫోటోలను తీసిన గుత్తా జ్వాల.. నెట్టింట వైరల్

July 25, 2022

న్యూడ్ ఫొటో షూట్.. సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదొక కొత్త ట్రెండ్‌. అప్పుడెప్పుడో పీకే సినిమా కోసం అమీర్ ఖాన్ ఈ షూట్ చేసి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత మళ్లీ మన తెలుగు కుర్రాడు విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’ మూవీ ప్రమోషన్స్‌ కోసం న్యూడ్ స్టిల్‌తో అందర్నీ షాక్‌కు గురి చేశాడు. ఈ ట్రెండ్‌ను ఇప్పుడు వివిధ హీరోలు, నటులు ఫాలో అవుతున్నారు. విజయ్‌ దేవరకొండ తర్వాత ఓ బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్‌ నటుడు రాహుల్ ఖన్నా అర్ధనగ్నంగా ఫొటోలు దిగి నెట్టింట్లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత బాలీవుడ్‌ యంగ్‌ హీరో రణ్‌వీర్ సింగ్‌ కూడా ఓ మ్యాగజైన్‌ కోసం నగ్నంగా ఫొజులిచ్చి సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో హీరో కూడా జాయిన్ అయ్యాడు. లతనే విష్ణు విశాల్.

‘రత్సాసన్’ లాంటి సినిమాలతో బ్లాక్‌బస్టర్ అందుకొని ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులో కూడా చిత్రాలు చేస్తూ ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు ఈ హీరో. కొన్నాళ్ల క్రితం విష్ణు విశాల్.. బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తాను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె తీసిన ఫోటోలనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. Well… joining the trend ! అనే క్యాప్షన్తో తన న్యూడ్‌ పిక్స్‌ను తన ట్విట్టర్‌ అకౌంట్లో షేర్ చేశారు. షేర్ చేయడమేకాదు.. తన వైఫ్ గుత్తా జ్వాల ఈ న్యూడ్‌ ఫోటోలను క్లిక్ చేశారని చెబుతూ అందర్నీ షాక్ చేశారు. దీంతో వీరు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకా ఎంతమంది హీరోలు ఈ న్యూడ్ ఫోటోషూట్ ట్రెండ్‌ను ఫాలో అవుతారో చూడాలి మరి.