Vishwa Sundari's relationship with a married man
mictv telugu

పెళ్ళైన వ్యక్తితో.. విశ్వ సుందరి రిలేషన్

November 22, 2022

 

సెలబ్రెటీల పర్సనల్ మ్యాటర్స్ పై అభిమానుల ఆసక్తి అంతా ఇంతా ఉండదు. బాయ్ ఫ్రెండ్ ఎవరు, డేటింగ్ ఎవరితో, రిలేషన్ స్టేటస్ ఏంటీ అన్న అంశాలపై ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, బ్రేకప్ చెప్పేయటం సర్వసాధారణం. అయితే పెళ్ళైన వ్యక్తులపై కూడా మోజు వంటి యవ్వారాలు ఎక్కువగానే ఉంటాయి. తాజాగా ఇలాంటి ఒక షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. అది కూడా ఒక మాజీ విశ్వసుందరి గురించి. కొద్దీ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ 2022లో విడుదలైన సామ్రాట్ పృథ్వీరాజ్ లో అక్షయ్ కుమార్‌తో కలిసి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. తరచుగా తన జీవితంలోని స్నీక్ పీక్‌ని అభిమానులతో పంచుకునే అలవాటున్న మానుషి వ్యక్తిగత జీవితం ఇప్పుడు బజారుకెక్కింది.

బాలీవుడ్ వివరాల ప్రకారం ఆమె ఒక పెళ్ళైన బడా బిజినెస్ మెన్ తో డేటింగ్ చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే భార్యకి విడాకులు ఇచ్చిన ఆ వ్యాపారవేత్త పేరు నిఖిల్ కామత్‌. వీరిద్దరూ 2021 నుండి డేటింగ్ చేస్తున్నారట. ఈ విషయం తెలిసే భార్య విడాకులు ఇచ్చి వెళ్లిపోయిందట. ఇప్పుడు వీరిద్దరి రిలేషన్ బయటపడటంతో ఆ మాజీ భార్య విశ్వసుందరిని బండ బూతులు తిడుతూ పోస్టులు పెడుతుందట. తన కాపురంలో చిచ్చు పెట్టిన ఆమె జీవితం కూడా ఎదో ఒకరోజు నాలాగే అవుతుందని శాపనార్థాలు పెడుతుందట. పాతికేళ్ల మానుషి చిల్లర్ పెళ్ళైన 35ఏళ్ళ వ్యక్తితో ప్రేమలో పడట మేంటని నెటిజన్స్ కూడా విమర్శిస్తున్నారు. ఇక బాలీవుడ్ కథనాల ప్రకారం వీరిద్దరూ కలిసి చాలా టూర్లకు వెళ్లారట. తాజాగా వీరిద్దరూ దైవ దర్శనం చేసుకున్న ఫోటో కూడా ఒకటి సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇక బిజినెస్ మెన్, జెరోధా సహవ్యవస్థాపకుడు అయిన కామత్ 2019 సంవత్సరంలో ఇటలీలో అమండా అనే మహిళను గ్రాండ్ గా వివాహం చేసుకుని 2021లో విడాకులు తీసుకున్నారు.