బెంజ్ కొన్న విశ్వక్ సేన్.. ఆ కారు తనదేనన్న తరుణ్ - MicTv.in - Telugu News
mictv telugu

బెంజ్ కొన్న విశ్వక్ సేన్.. ఆ కారు తనదేనన్న తరుణ్

May 18, 2022

హీరో విశ్వక్ సేన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి వివాదాల్లో కాదు.. అత్యంత ఖరీదైన కారును కొని తాజాగా అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకుముందే రేంజ్ రోవర్ కారును కొనేసిన విశ్వక్ సేన్,.. తాజాగా బెంజ్ కారులో టాప్ అండ్ లేటెస్ట్ మోడల్‌ను సొంతం చేసుకున్నాడు. మెర్సిడెజ్ బెంజ్ జి వేగన్ 2022 మోడల్‌ను కొనేశాడు. దీని ధర తక్కువలో తక్కువ 2. 5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఉంది. తాను కొన్న కొత్త కారుతో ఉన్న ఫోటోలను విశ్వక్.. సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అది నాదే.. ఫోటోలు దిగుతానంటే ఇచ్చిన అని కౌంటర్ వేశాడు. అలీ రెజా కంగ్రాట్స్ అని కామెంట్ పెట్టేశాడు. ఇక విశ్వక్ ఫ్యాన్స్ అయితే పార్టీ ఏది అన్నా అని కామెంట్లు పెడుతున్నారు. తాజాగా అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాతో మంచి హిట్ కొట్టేశాడు విశ్వక్ సేన్. ఈ సినిమాలో అర్జున్ కుమార్ అల్లం పాత్రలో అతని నటనకు అందరూ ఫిదా అయ్యారు.