మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా నటిస్తున్న చిత్రం దాస్ కా ధమ్కీ. విశ్వక్ స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. శుక్రవారం సాయంత్రం దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూ.ఎన్టీఆర్ ముఖ్యఅథితిగా హాజరయ్యాడు. ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలో సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ షురూ చేశాడు హీరో విశ్వక్ సేన్.
శనివారం ప్రమోషన్స్‌లో భాగంగా మీడియోతో చిట్‌చాట్ నిర్వహించాడు. ఈ సమయంలో మరోసారి విశ్వక్‌కు అర్జున్ వివాదం అంశంపై స్పందించాలని ఓ మీడియా ప్రతినిధి కోరారు. ఆ వివాదంపై ఆప్డేట్ ఏంటీ ప్రశ్నించాడు. దీనిపై విశ్వక్ సేన్ మాత్రం మాట్లాడేందుకు నిరాకరించాడు. ఈ సమయంలో దాని కోసం మాట్లాడడం సరికాదని చెప్పాడు. అయినా సదరు మీడియా ప్రతినిధి మీరు సినిమా నుంచి వచ్చేసినందుకు అర్జున్‌కు భారీగా డబ్బులు ఇచ్చారని..ఆ విషయంలో మీరు చాలా బాధపడ్డారని విన్నాను అంటూ వ్యాఖ్యానించాడు. దీనికి కూడా విశ్వక్ నో కామెంట్ అంటూ సమాధాన మిచ్చాడు. ఎంతోమందిపై ఉన్న గౌరవంతో నేను దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదని తేల్చి చెప్పేశాడు.
మరోవైపు ధమ్కీ దర్శకుడిని మార్చడంపై విశ్వక్ స్పందించాడు. సినిమా కథ విషయంలో ఇద్దరి అభిప్రాయాలు కుదరకపోవడంతో నరేష్ కొప్పిలి కలిపి పనిచేయలేకపోయామని క్లారిటీ ఇచ్చాడు. తనతో పాగల్ సినిమా కలిసి చేస్తున్న సమయంలో నరేష్‌నే దర్శకుడిగా తీసుకోవాలని నిర్ణయించానని అయితే తర్వాత కథ గురించి చర్చించుకున్నప్పుడు.. అతడి ఆలోచన విధానానికి.. నేను అనుకున్న స్టోరీకి పొంతన కుదరకపోవడంతో అతడు ప్రాజెక్టును నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నాడు. అతడి త్వరలో మరో సినిమా తీయనున్నట్లు తెలిపాడు. నరేష్ తప్పుకున్న విషయంలో ఎలాంటి వాదనలు జరగలేదని విశ్వక్ చెప్పాడు.
అర్జున్‌తో విశ్వక్ గొడవ ఇదే..
అర్జున్ తన స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాను ప్లాన్ చేశాడు. తన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా,విశ్వక్‌ను పెట్టి సినిమాను ప్రారంభించాడు. ఈ చిత్రానికి పవర్‌స్టార్ పవన్ కల్యాన్ కూడా వచ్చి క్లాప్ కొట్టారు. ఉన్నట్టుండి సినిమా విషయంలో అర్జున్‌కు, విశ్వక్ మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయి. కథ విషయంలో విశ్వక్ సేన్ తలదూర్చడంతో సమస్య మొదలైంది. అనంతరం సినిమా నుంచి విశ్వక్ తప్పుకున్నాడు. దీంతో విశ్వక్ సేన్ షూటింగ్‌కు రాకుండా ఇబ్బంది పెట్టాడని..అతని వల్ల చాలా లాస్ అయ్యానంటూ అర్జున్ ఏకంగా మీడియా సమావేశం పెట్టి విమర్శించాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాడు. తర్వాత కూడా వివాదం సద్దుమణగపోవడంతో సినిమా మధ్య లోనే ఆగి పోవాల్సి వచ్చింది.