యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. శుక్రవారం విడుదలవబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన ప్రాంక్ వీడియో వివాదంగా మారింది. ఈ వీడియోపై డిబేట్ నిర్వహించిన టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లిపై విశ్వక్సేన్ ఫ.. అనే బూతు పదాన్ని వాడటం పెద్ద కాంట్రవర్సీగా మారింది. చిన్నగా మొదలైన ఈ గొడవ పొలిటికల్ , ఫిల్మ్ ఇండస్ట్రీల వరకూ పాకింది.
తాజాగా ఈ విషయంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తామసలు విశ్వక్ సేన్ ని మేం అయితే హీరోగానే గుర్తించడం లేదన్నారు. బాధ్యత గల ఓ మహిళా జర్నలిస్ట్‌పై.. లైవ్ లో ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు. మీడియాలో మాట్లాడాల్సిన సమయంలో అనేక ప్రశ్నలు ఎదురవుతుంటాయని, వాటికి జవాబు చెప్పే సత్తా ఉన్నప్పుడు మాత్రమే మీడియా ముందుకు వెళ్లాలి లేదంటే మూసుకొని ఉండాలన్నారు. స్టూడియోలో విశ్వక్ సేన్ అలా మాట్లాడినప్పుడే ఆ మహిళా యాంకర్ అతడిని చెప్పుతో కొట్టాల్సిందని అన్నారు. విశ్వక్సేన్ మీద పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని, లేకపోతే మహిళా సంఘాలతో కేసు పెట్టిస్తామని అన్నారు.
విశ్వక్ సేన్ లాంటి దుర్మార్గుడిని సినిమాల్లోకి తీసుకోవద్దని దర్శక నిర్మాతలను కోరుతున్నానని దానం నాగేందర్ అన్నారు. మరో వైపు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా విశ్వక్సేన్పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.