బాలీవుడ్‌కు వెళ్లిపోతా... విశ్వక్‌సేన్ - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్‌కు వెళ్లిపోతా… విశ్వక్‌సేన్

May 4, 2022

విశ్వ‌క్ సేన్.. గ‌త రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న టాపిక్. త‌న కొత్త సినిమా ప్ర‌మోష‌న్ కోసం చేసిన ప్రాంక్ వీడియో.. ఆ వీడియో టీవీ ఛాన‌ల్‌లో డిబేట్.. డిబేట్లో అతడు, యాంకర్ దేవి నాగవల్లి గొడవ పడి వివాదంలో చిక్కుకున్నారు. ఈ వివాదంపై ప్ర‌ముఖ సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు కూడా స్పందించ‌డం అత‌ని సినిమాకు ఊహించిన దానికంటే ఎక్కువ ప‌బ్లిసిటీని తెచ్చిపెడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి తాజా ప్రెస్ మీట్ కీల‌క విష‌యాలు తెలిపాడు విశ్వ‌క్‌సేన్.

తాను త్వ‌ర‌లో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నట్లు చెప్పాడు. మరో రెండేళ్లలో బాలీవుడ్‌లో మాస్ కా దాస్ అనే టైటిల్ తో డైరెక్ష‌న్ చేయ‌బోతున్న‌ట్లు తెలిపాడు. దీనిపై త్వరలో అన్ని వివరాలను ప్రకటిస్తాన‌ని చెప్పుకొచ్చాడు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో.. విశ్వ‌క్‌సేన్‌కు నెటిజ‌న్ల నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.