Visually-Impaired Girls Garner Applause As They Walk The Ramp At A Fashion Show In Rajkot
mictv telugu

అందరీ ‘కళ్లు’ వాళ్ల వైపునకు తిప్పుకున్నారు!

December 22, 2022

ఫ్యాషన్ అనేది ఎక్కువగా కళ్లకు ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఫ్యాషన్ షో ర్యాంప్ పై నడవడానికి అంధ అమ్మాయిలు, దృష్టి లోపం ఉన్న మోడల్స్ ని ఎంచుకొని ప్రేక్షకులను విస్మయానికి గురి చేశారు.

మూస పద్ధతిని బద్దలు కొట్టింది ఈ ఫ్యాషన్ షో. ఈ దృష్టి లోపం ఉన్న బాలికలు రన్ వేను స్టైల్ గా మార్చారు. అంతేకాదు.. వారు ప్రేక్షకుల నుంచి కరతాళ ధ్వనులను విన్నారు. ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ జువెలరీ డిజైన్ (ఐఎఫ్జేడి)నిర్వహించిన ఫ్యాషన్ షోలో ఎనిమిది మంది దృష్టి లోపం ఉన్న బాలికలు గుజరాత్ లోని రాజ్ కోట్ లో ర్యాంప్ పైకి వచ్చారు. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కలిసి ర్యాంప్ మీద నడిచారు. ఆ తర్వాత అమ్మాయిలు సోలోగా నడిచి ప్రేక్షకుల నుంచి హృదయపూర్వకంగా చప్పట్లు

అందుకున్నారు.
పాతకాలపు వెస్ట్రన్ లుక్ కోసం అమ్మాయిలు లేత రంగుల ధరించారు. పైన నల్లని లేస్ తో వచ్చిన హెడ్ బ్యాండ్ పెట్టుకున్నారు. తేలికపాటి మేకప్ తో వింత రంగు గౌన్స్ ను ధరించారు. వీడీ పరేఖ్ ఆంధ్ మహిళా వికాస్ గ్రహాకు చెందిన అమ్మాయిలు షోలో కనిపించడానికి ముందు 15 నుంచి 20 రోజుల పాటు ప్రాక్టీస్ చేశారని చెప్పారు. అందులో ఒకమ్మాయి ‘మేం ప్రేక్షకుల నుంచి చప్పట్లు విన్నప్పుడు మేం మంచి పని చేశాం అనిపించింది. థ్రిల్ గా ఉన్నాం. రెండు వారాలకు పైగా ప్రాక్టీస్ చేశాం’ అంటూ చెప్పారు.
నత్వానీ మాట్లాడుతూ.. ‘ఈ అమ్మాయిలు చాలా కష్టపడి పని చేశారు. నేను వారు ర్యాంప్ పై అద్భుతమైన పని చేశారు. మొదట్లో వారికి ఇది చాలా కష్టంగా ఉంది. కానీ వారు చాలా త్వరగా ప్రతిదీ నేర్చుకున్నారు. అమ్మాయిల మోడలింగ్ ని మెచ్చుకుంటున్నారు’ అని అన్నారు.