vitamin E rich food helps skin
mictv telugu

చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ ఇ కావాల్సిందే….

January 6, 2023

vitamin E rich food helps skin, and hair

విటమిన్లు, మినరల్స్ అన్నీ సక్రమంగా అందితేనే మన శరీరం బాగా సని చేస్తుంది. ఏ విటమిన్ లోపం అయినా కూడా సమస్యలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. అందుకే ప్రతీ విటమిన్ చాలా ముఖ్యమైనది.

మన శరీరంలో జీవక్రియను బలోపేతం చేయడానికి విటమిన్‌ ఇ చాలా అవసరం. విటమిన్‌‌ ‘E’ శరీరంలో శరీరంలో యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది మన ఇమ్యూనిటీ పెంచడానికి సహాయపడుతుంది.కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. విటమిన్ ఇ కంటి సమస్యలను తగ్గిస్తుంది.యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. విటమిన్‌ E.. తలలో రక్తప్రసరణను మెరుగుపరచి జుట్టు సమస్యలను దూరం చేస్తుంది. మన శరీరంలో విటమిన్‌ ఇ లోపం ఉంటే.. కంటి సమస్యలు, చర్మ సమస్యలు, ఇమ్యూనిటీ తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. చాలా మంది విటమిన్‌ ఇ సప్లిమెంట్స్‌ తీసుకుంటూ ఉంటారు. యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ డేటా ప్రకారం పెద్దలకు రోజుకు 15 మైక్రోగ్రాముల విటమిన్ ఇ సరిపోతుంది. మీరు తీసుకునే డైట్‌ ద్వారా.. విటమిన్‌ ఇ లోపాన్ని దూరం నివారించవచ్చు.

పళ్ళు:

ముందుగా ఏఏ పళ్ళల్లో విటమిన్ ఇ సమృద్ధిగా ఉందో తెలుసుకుందాం. మీడియం సైడ్‌ మామిడి పండులో 1.5 మైక్రోగ్రాముల విటమిన్‌ ఈ ఉంటుంది. అదే 100 గ్రాముల మామిడి ముక్కల్లో 0.9 మైక్రోగ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. అలాగే 100 గ్రాముల కివీ పండు తినడం వల్ల 1.5 మైక్రోగ్రాముల విటమిన్ ఇ లభిస్తుంది.ఇక సగం సపోటా పండులో 5.9 మైక్రోగ్రాములు,అవోకాడోలో 100 గ్రాములకి 2.1 మైక్రోగ్రాములు, 100 గ్రాముల బ్లాక్‌బెర్రీస్ 1.2 మైక్రోగ్రాముల విటమిన్ ఇ ఉంటాయి.

కూరలు:

విటమిన్ ఇ అన్ని కూరల్లో ఉండదు. చాలా తక్కువ వాటిల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి వాటిని తరుచుగా తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. 100 గ్రాముల పండు మిర్చిలో 1.6 మైక్రోగ్రాముల విటమిన్ ఇ ఉంటుంది.అలాగే 100 గ్రాముల పాలకూరలో 2.9 మైక్రోగ్రాములు, ఉడికించిన 100 గ్రాముల బీట్‌రూట్‌లో 1.8 మైక్రోగ్రాములు, 100 గ్రాముల గుమ్మడి ముక్కలలో 2.3 మైక్రోగ్రాముల విటమిన్ ఇ ఉంటుంది.

నట్స్:

100 గ్రాముల పొద్దుతిరుగుడు విత్తనాలలో 35 మైక్రోగ్రాముల విటమిన్ ఇ లభిస్తుంది. అదేవిధంగా, 100 గ్రాముల బాదంలో 26 మైక్రోగ్రాములు, 100 గ్రాముల పైన్ గింజలలో 9.3 మైక్రోగ్రాములు,
100 గ్రాముల హాజెల్ నట్స్‌లో 4.3 మైక్రోగ్రాములు, 100 గ్రాముల వేరుశెనగలో 8.3 మైక్రోగ్రాములు,100 గ్రాముల గుమ్మడి గింజల్లో 2.2 మైక్రోగ్రాములు, 100 గ్రాముల జీడిపప్పులో 0.9 మైక్రోగ్రాముల విటమిన్ ఇ ఉంటుంది.

నూనెలు:

వంటలో ఎక్కువగా ఉపయోగించే సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో టేబుల్‌స్పూన్‌కు 5.6 మైక్రోగ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ బాదం నూనెలో 5.3 మైక్రోగ్రాములు,
పత్తి గింజల నూనెలో టేబుల్‌స్పూన్‌కు 4.8 మైక్రోగ్రాములు,రైస్ బ్రాన్ ఆయిల్‌లో టేబుల్‌స్పూన్‌కు 4.4 మైక్రోగ్రాములు,ఒక టేబుల్ స్పూన్ వీట్ జెర్మ్ ఆయిల్‌లో 20 మైక్రోగ్రాములు,పామాయిల్‌లో టేబుల్‌స్పూన్‌కు 2.2 మైక్రోగ్రాముల విటమిన్ ఇ ఉంటుంది.

మాంసం:

డక్, ఫిష్, రొయ్యలలో మాత్రమే విటమిన్ ఇ దొరుకుతుంది. 100 గ్రాముల బాతు మాంసంలో 1.7 మైక్రోగ్రాములు, అట్లాంటిక్ సాల్మన్‌లో 1.1 మైక్రోగ్రాములు, క్రేఫిష్‌లో 1.5 మైక్రోగ్రాములు
రొయ్యలలో 1 మైక్రోగ్రాము విటమిన్ ఇ ఉంటుంది.