‘ద కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడుతున్న నగరం - MicTv.in - Telugu News
mictv telugu

‘ద కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడుతున్న నగరం

March 25, 2022

sssss

ఇటీవల సంచలనం రేపిన ద కశ్మీర్ ఫైల్స్ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరాన్ని ఉద్దేశిస్తూ ఆయన మాట తూలారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ నేను భోపాల్లోనే పుట్టి పెరిగినా, అలా పిలిపించుకోవడానికి ఇష్టపడను. ఎందుకంటే భోపాలీ అంటే ఒక నిర్దిష్ట అర్థం వచ్చేలా ప్రజల మనస్సులో నిలిచిపోయింది. భోపాల్ నవాబుల పాలనలో ఉంది కాబట్టి వారి కోరికల కారణంగా నగరానికి ఇలాంటి పేరు వచ్చి ఉండొచ్చు’ అని అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ‘ వివేక్ గారూ, అది మీ పర్సనల్ అనుభవం అయి ఉండొచ్చు. నేను కొన్ని దశాబ్దాలుగా భోపాల్ ప్రజలతో అనుబంధం కలిగి ఉన్నా. నాకెప్పుడూ అలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. ఒకవేళ మీ పక్కనున్న వాళ్లు అలాంటి వాళ్లేమో ఒకసారి చెక్ చేసుకోండి’. అంటూ ట్వీట్ చేశారు. మరో కాంగ్రెస్ ప్రతినిధి కేకే మిశ్రా బీజేపీపై సెటైర్ వేశారు. ‘భోపాల్ మొత్తాన్ని హోమోసెక్సువల్‌గా ఏ రకంగా అంటున్నాడు? అగ్నిహొత్రిపై తీసుకునే చర్యలేంటి? చర్యలు తీసుకోకపోతే మీది రాజకీయ నపుంసకత్వం అవుతుంది’అని ఆ రాష్ట్ర హోం మంత్రిని ట్యాగ్ చేశారు. కాగా, వివేక్ అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యల పట్ల భోపాల్ ప్రజలు మండిపడుతున్నారు. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.