Vivek Agnihotri Hits Back At Prakash Raj For Calling ‘The Kashmir Files’ A ‘Nonsense Film’
mictv telugu

ప్రకాశ్ రాజ్‌కు ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు స్ట్రాంగ్ కౌంటర్..

February 10, 2023

‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై వివాదాలు కొనసాగుతున్నాయి. సంవత్సరం క్రితం విడుదలైనా ఇప్పటికీ చిచ్చురేపుతుంది. ఇటీవల ఈ చిత్రం, దర్శకుడు అగ్నిహోత్రీని విమర్శిస్తూ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేయడం మరోసారి అగ్గిరాజుకుంది. ది కాశ్మీర్ ఫైల్స్ అనేది నాన్సెన్స్ సినిమా.. దానికి తీసి డైరెక్టర్‌కు భాస్కర్ అవార్డు ఇవ్వాలంటూ ప్రకాశ్ రాజ్ విమర్శించారు. కాకరేపిన ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలకు తాజాగా చిత్ర దర్శకుడు అగ్నిహోత్రి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

ప్రకాశ్ రాజ్ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ ” జనాలు ఆదరించిన కశ్మీర్ ఫైల్స్ మూవీ అర్బన్ నక్సల్స్‎కు నిద్రలేకుండా చేసింది. అలాంటి వారు సినిమా విడుదలై ఏడాదైనా ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. వారు మొరిగే కుక్కలు. మిస్టర్ అంధకార్ రాజ్ (ప్రకాశ్ రాజ్‎ను ఉద్దేశిస్తూ) భాస్కర్ అవార్డు ఎప్పటికీ మీదే అయినప్పుడు నేనెలా పొందుతాను” అంటూ అగ్నిహోత్రి ట్విట్టర్ వేదికగా ఫైరయ్యారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

ప్రకాశ్‎రాజ్ ఏమన్నారంటే..

రెండు రోజుల క్రితం కేరళలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్‌లో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ ది కశ్మీర్ ఫైల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ జ్యూరీయే ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై ఉమ్మేసిందని విమర్శించాడు. అయినా సిగ్గులేకుండా దర్శకుడు ఆస్కార్ ఎందుకు రాదు? అని అడిగారంటూ ఫైరయ్యాడు. ఆ సినిమాకు కనీసం భాస్కర్ అవార్డు కూడా రాదని ఎద్దేవ చేశాడు. ఇలాంటి వారు కేవలంల మొరగాడానికే మాత్రమే పనికొస్తారుగానీ..కాటువేసే దమ్ము లేదన్నారు.