లాక్‌డౌన్‌తో ఉపాధి కోసం వలస వెళ్లిన కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి, అద్దె చెల్లించలేక సతమతమవుతున్నారు. అలాంటి వారికి పలువురు సీని,రాజకీయ,వ్యాపారవేత్తలు సాయం చేస్తున్నారు. తమ వంతుగా సాయం చేస్తూ.. ఎంతో కొంత ఊరట కలిగిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా వలస కూలీలకు అండగా నిలిచారు. ఏకంగా 5 వేల మందికి అద్దె చెల్లించడంతో పాటు వారికి కావాల్సిన నిత్యావసరాలను అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు.
చాలా ప్రాంతాల్లో ప్రజలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లలేక అద్దె ఇళ్లలోనే ఉండిపోయిన వారికి వివేక్ వివేక్ ఒబెరాయ్, ఫిన్‌టెక్ స్టార్టప్ సంస్థ వ్యస్థాపకుడు రోహిత్‌తో కలసి పేదలకు సాయం చేశారు. 5 వేల మందిని గుర్తించి వారికి ఇంటి ఖర్చు, అద్దె చెల్లించడానికి ఎంత అవుతుందో లెక్కలు వేయించారు. ఆ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయించారు. జనం గుంపులుగా లేకుండా సులభమైన పద్దతిలో డబ్బులను వారికి పంపించారు. దీంతో ఆయన చేసిన సేవకు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా రక్త చరిత్ర సినిమాతో వివేక్ ఒబెరాయ్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన సంగతి తెలిసిందే.