డ్రగ్స్ కేసు.. మోదీ బయోపిక్ నటుడి భార్యకు నోటీసులు - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్ కేసు.. మోదీ బయోపిక్ నటుడి భార్యకు నోటీసులు

October 16, 2020

bcbcb

హిందీ, కన్నడ సినీ పరిశ్రమలను డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. రెండు పరిశ్రమల్లోని కొందరు నటీనటులు ఇప్పటికే విచారణ ఎదురుకున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనె, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధ కపూర్ లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముందు విచారణకు హాజరయ్యారు. కన్నడ సినీ పరిశ్రమ డ్రగ్స్ కేసులో హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రాణిలు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఇప్పటివరకు దాదాపు 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్‌లో నటించిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ భార్య ప్రియాంక అళ్వాకు బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు పంపారు. ఆమె సోదరుడు ఆదిత్య అల్వాకు ఈ డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నాయి. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. అతడితో ప్రియాంకకు కూడా సంబంధాలు ఉన్నట్టు బెంగళూరు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఈరోజు నోటీసులు ఇచ్చారు. ఆదిత్య అల్వా కోసం నిన్న బెంగళూరు పోలీసులు ముంబైలోని వివేక్ ఒబెరాయ్ ఇంట్లో తనిఖీలు చేశారు. కర్ణాటక మాజీ మంత్రి, జీవరాజ్‌ కుమారుడు ఆదిత్య అల్వా. అతడి సోదరి ప్రియాంకను వివేక్ వివాహం చేసుకున్నాడు. పలువురు కన్నడ సినీ ప్రముఖలకు డ్రగ్స్ సరఫరా చేసిన కేసులో ఆదిత్య ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.