వివేకాను చంపించింది జగనే.. అల్లుడి సంచలన వాంగ్మూలం - MicTv.in - Telugu News
mictv telugu

వివేకాను చంపించింది జగనే.. అల్లుడి సంచలన వాంగ్మూలం

March 1, 2022

jjjjj

ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్ జగనే… వివేకానందరెడ్డిని హత్య చేయించి ఉంటారని వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్నొన్నారు. 2018 లో విశాఖ విమానాశ్రయంలో జగనపై జరిగిన కోడికత్తి దాడి తర్వాత చికిత్స కోసం హైదరాబాద్ వచ్చారు. అప్పుడు ఆయనకు చికిత్స చేసిన డాక్టర్లు ఈ రోజు ప్రభుత్వ పదవుల్లో ఉన్నారు. ఆ దాడిలాగే మా మామను హతమార్చడంలో జగనే పథక రచన చేసి ఉంటారని వివరించారు. అలాగే 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం వివేకాకు అస్సలు ఇష్టం లేదనీ, జగన్ ఒత్తిడి మేరకే బరిలోకి నిలిచారని తెలియజేశారు. ‘ఆ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి తన కంటే బలహీనమైన అభ్యర్థి బీటెక్ రవి చేతిలో 30 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీనికి కారణం ఏంటని ఆరా తీస్తే మా బంధువులైన భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలు పులివెందులలో ఓట్లు పడకుండా చేశారని తెలిసింది. ఆ ఎన్నిక కోసం చేసిన అప్పు తీర్చడానికి మా అస్తులు అమ్ముకోవాల్సి వచ్చింద’ని వాంగ్మూలంలో వివరించారు.

అవినాశ్ పై చర్యలు తీసుకోవాలి
‘నా తండ్రి హత్య వెనుక కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హస్తం ఉంది. ఆయనను విచారించి తగిన చర్యలు తీసుకోవాలి. ఈ కుట్రలో ఉన్న వారిని బయటకి లాగి తగిన శిక్ష పడేలా చేయాల’ని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె ఎన్. సునీత రాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్, పీఎం కార్యాలయాం, కేంద్ర హోం మంత్రికి లేఖలు రాశారు.