రచ్చరచ్చ.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న చైనా వివో - MicTv.in - Telugu News
mictv telugu

రచ్చరచ్చ.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న చైనా వివో

August 4, 2020

క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్న సంగతి తెల్సిందే. భారత్ లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్ లను దుబాయ్ లో నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వివో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదికి ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకునట్టు ప్రకటించింది.

ఇటీవల భారత్, చైనా సరిహద్దుల్లో ఘర్షణల వాతావరణం నెలకొన్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో భారత్ లో చైనా ఉత్పత్తులను నిషేధించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చైనా కంపెనీలకు ఇచ్చిన కాంట్రాక్టులను రద్దు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు పెద్ద ఎత్తున చైనా వ్యతిరేక నిండ్లు చేస్తున్నారు.
దీంతో ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి వివో తప్పుకుంది. వివో సంస్థకు 2022 వరకు ఐపీఎల్ తో స్పాన్సర్ షిప్ ఒప్పందం ఉన్నాగానీ, ఈ సీజన్ కు స్పాన్సర్ గా తప్పుకోవాలని నిర్ణయించుకుంది. 2018లో వివో సంస్థ ఐపీఎల్ కోసం బీసీసీఐతో రూ.2199 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఐదేళ్లపాటు స్పాన్సర్ షిప్ హక్కులు ఉంటాయి. బీసీసీఐ నిన్న కూడా ఓ ప్రకటన చేస్తూ…. తమ స్పాన్సర్లందరూ తమతోనే ఉంటారని స్పష్టం చేసింది. కానీ, వివో స్వచ్ఛందంగా తప్పుకోవడం గమనార్హం.