వివో యూ10 వచ్చేసింది..  - MicTv.in - Telugu News
mictv telugu

వివో యూ10 వచ్చేసింది.. 

September 24, 2019

Vivo U10.......

ఎప్పటినుంచో ఊరిస్తున్న వివో యూ10 మోడల్‌ మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఈ నెల 29 నుంచి అందుబాటులోకి రానుంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌ వంటి ప్రత్యేకతలు వున్న ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.8,900గా నిర్ణయించారు. ఇందులో మరొక ప్రత్యేకత ఏంటంటే ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంది. అలాగే వివో యూ10 ప్రాథమిక వేరియంట్‌ ధర రూ.8,990, 3జీబీ ర్యామ్‌, 32 జీబీ మెమొరీ ఉంటుంది. రెండో మోడల్‌లో 3 జీబీ ర్యామ్‌, 64 జీబీ మెమొరీ ధరను రూ.9,990గా, 4జీబీ ర్యామ్‌, 64జీబీ మెమొరీ ఉన్న ఫోన్‌ ధర రూ.10,990గా నిర్ణయించారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డుతో కొనేవారికి అదనంగా 10% డిస్కౌంట్ లభిస్తుంది. రిలయన్స్ జియో నుంచి రూ.299 ప్లాన్‌పై రూ.6,000 విలువైన బెనిఫిట్స్ లభిస్తాయి.

 

ప్రత్యేకతలు ఇలా

స్నాప్‌ డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌

ముందు 8మెగాపిక్సెల్‌ కెమెరా

6.35 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే

5000ఎంఏహెచ్‌ బ్యాటరీ

వెనుక 13+8+2 మెగాపిక్సల్‌ ట్రిపుల్‌ కెమెరా సెటప్‌