వివో యు20 ఫోన్ వచ్చేసింది.. ధర రూ. 10990 - MicTv.in - Telugu News
mictv telugu

వివో యు20 ఫోన్ వచ్చేసింది.. ధర రూ. 10990

November 23, 2019

స్మార్ట్ ఫోన్  రంగంలో సరికొత్త ఒరవడితో దూసుకెళ్తున్న వీవో మరో కొత్త మొబైల్‌ను తీసుకువచ్చింది. వీవో యు20 పేరుతో భారత మార్కెట్లోకి విడుదల చేశారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.10,990గా నిర్ణయించారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ ఫోన్లను ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. వీటి విక్రయాల ప్రారంభంలో భాగంగా వినియోగదారులకు ఆదిరిపోయే ఆఫర్ కూడా ఇస్తున్నారు. లాంచింగ్ సందర్భంగా ప్రీపేయిడ్ విధానంలో కొనుగోలు చేసిన వారికి వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఇక 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ వెర్షన్‌లో స్మార్ట్ ఫోన్ ధర రూ.11,990గా ఉంది.

Vivo U20.

వివో యు20 ఫీచర్స్ : 

 

డిస్ల్పే : 6.53 ఇంచులు

ర్యామ్ : 4/6 జీబీ

 స్టోరేజ్ : 64జీబీ, 

కెమెరా : 16, 8, 2 ఎంపీట్రిపుల్ బ్యాక్ కెమెరా

బ్యాటరీ : 5000 ఎంఏహెచ్

ఫింగర్ ప్రింట్ సెన్సార్