ప్రపంచంలోనే తొలి పాప్‌అప్ సెల్ఫీ ఫోన్ విడుదల - Telugu News - Mic tv
mictv telugu

ప్రపంచంలోనే తొలి పాప్‌అప్ సెల్ఫీ ఫోన్ విడుదల

February 20, 2019

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో ప్రపంచంలోనే తొలిసారిగా 32 మెగాపిక్సల్ పాప్‌అప్ సెల్ఫీ కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వివో వి15 ప్రొ బుధవారం భారత మార్కెట్లో విడుదలైనది. ఇది ప్రపంచంలోనే తొలి పాప్అప్ సెల్ఫీ కెమెరా ఫోన్ అని వివో తెలిపింది. వెనుకవైపు మూడు కెమెరాలతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా పొందుపర్చింది. దీని ధరను రూ.28,990 గా నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ద్వారా మార్చి 6వ తారీఖు నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది.

వివో వి15 ప్రొ ఫీచర్లు

6.39 అంగుళాల అమోలెడ్ అల్ట్రా ఫుల్ వ్యూ డిస్‌ప్లే

క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్

6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ

48+5+8 ఎంపీ ట్రిపుల్ కెమెరా

32 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా

3,700 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయెల్ ఇంజిన్ ఫాస్ట్ చార్జింగ్