గింబల్ కెమెరాతో ఫోటోలు షేక్ అవవు.. జూన్ 1న వివో కొత్త ఫోన్ - Telugu News - Mic tv
mictv telugu

గింబల్ కెమెరాతో ఫోటోలు షేక్ అవవు.. జూన్ 1న వివో కొత్త ఫోన్

May 15, 2020

FBHFTNHJN

ఓ చైనీస్ రియాలిటీ షోలో కనిపించి, ఎప్పటినుంచో ఊరిస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ‘వివో ఎక్స్ 50’ని జూన్ 1న లాంచ్ చేయనుంది. ఈ మేరకు కంపెనీ విబోలో ప్రకటించింది.  ఈ ఫోన్ చాలా ప్రత్యేకతలతో వస్తోంది. ఫోటోలు మరింత మెరుగ్గా రావడానికి గింబల్ కెమెరా స్టెబిలైజేషన్ ఫీచర్ ఇందులో ఉన్నట్లు మాత్రం వివో వెల్లడించింది. గింబల్ కెమెరా ఎఫెక్ట్ గురించి కంపెనీ మరింత హైలెట్ చేయడంతో వినియోగదారుల్లో ఆసక్తి నెలకొంది. 

గింబల్ కెమెరాతో ఫొటోలు తీస్తే కెమెరా షేక్ కారణంగా ఫొటోలు షేక్ అవ్వడం, బ్లర్ అవ్వడం వంటివి 200 శాతం ఉండవని వివో స్పష్టం చేసింది. 

దీనికి సంబంధించిన కీలక ఫీచర్ల గురించి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే వివో ఎక్స్50 ప్రమోషనల్ ఫోటోలను చూస్తే ఇందులో పంచ్ హోల్ డిస్‌ప్లేను అందించనున్నారు. దీనికి తోడు ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలను కూడా అందించనున్నారు.  వివో ఎక్స్50 స్మార్ట్ ఫోన్ల గురించి త్వరలో మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎక్స్ సిరీస్‌లో మరికొన్ని వివో ఫోన్లను జత చేయనుంది. కాగా, వివో ఎక్స్30, 5జీ స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్‌లో లాంచ్ చేసింది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలను అందించారు.