అదిరిపోయే ఫీచర్లతో.. భారత మార్కెట్లోకి 'వివో వై19' - MicTv.in - Telugu News
mictv telugu

అదిరిపోయే ఫీచర్లతో.. భారత మార్కెట్లోకి ‘వివో వై19’

November 18, 2019

Vivo Y19 launched.

చైనీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో.. వై సిరీస్‌లో భాగంగా ‘వివో వై19’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మిడ్ రేంజ్ బడ్జెట్ శ్రేణిలో విడుదలైన ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లను ఉన్నపటికీ ధర మాత్రం చాలా తక్కువ. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ.13,990గా వివో సంస్థ నిర్ణయించింది. మాగ్నటిక్ బ్లూ, స్ప్రింగ్ వైట్ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది.

 

వివో వై19 ఫీచర్లు..

 

* 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే,

* మీడియా టెక్ హీలియో పీ65 ప్రాసెసర్,

* 16+8+2 మెగా పిక్సెల్ రేర్ ట్రిపుల్ కెమెరా,

* 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* ఫింగర్ ప్రింట్ సెన్సార్,

* 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ,

* 18W ఫాస్ట్ చార్జింగ్,

* ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టం.