వివో కొత్త ఫోన్.. డిస్కౌంట్, జియో ప్యాకేజ్..
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈరోజు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో 'వివో జడ్1ఎక్స్' స్మార్ట్‌ఫోన్‌ను విడుదలైంది. 48 మెగాపిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరా, కేవలం 5 నిమిషాలు చార్జ్ చేస్తే మూడు గంటల పాటు మాట్లాడుకునే వెసులు బాటు కలిగిఉండడం ఈ ఫోన్ ప్రత్యేకత. ఇక ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. 6జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్ ధర రూ.16,990 కాగా, 6జీబీ ర్యామ్/128 జీబీ వేరియంట్ ధర రూ.18,990గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు, ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే 1250 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, జియో నుంచి రూ.6 వేల విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్ల ద్వారా ఈ నెల 13 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.
వివో జడ్1ఎక్స్ ఫీచర్లు
* డ్యూయల్ సిమ్,
* ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్,
* 6.38 అంగుళాల ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే,
* వాటార్ డ్రాప్ నాచ్,
* స్నాప్‌డ్రాగన్ 712 ఎస్ఓసీ,
* 48 ఎంపీ +8ఎంపీ +2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా,
* 32 ఎంపీ సెల్ఫీ కెమెరా,
* 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ.