వైజాగ్ గ్యాస్ లీక్.. హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..  - MicTv.in - Telugu News
mictv telugu

వైజాగ్ గ్యాస్ లీక్.. హెల్ప్ లైన్ నంబర్లు ఇవే.. 

May 7, 2020

విశాఖపట్నం గ్యాస్ లీకేజీ బాధితులను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధిత యంత్రాంగాలన్నింటిని రంగంలోకి దించింది. సాయం కోరేవారిని ఆదుకోడానికి ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. చికిత్స, ఆహారం, ఇతర సాయాల కోసం వీటికి ఫోన్ చేయొచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ వెల్లడించారు.

బాధితులు 7997952301, 8919239341లకు ఫోన్ చేయాలని, ఐపీవో ఆర్.బ్రహ్మ(9701197069)ని కూడా సంప్రదించవచ్చని తెలిపారు. నిరాశ్రయులు 9912305512 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు. మరోపక్క..పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజలకు సాయం చేస్తున్నాయి. జటాయుబృందం సభ్యులు బాధితులను ఆదుకుంటారని, 7799439129, 6303616240లకు ఫోన్ చేయాలని టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తెలిపాడు.