ఎల్జీ పాలిమర్స్.. టన్నుల నిర్లక్ష్యం, తనిఖీలు, సైరన్ గల్లంతు
విశాఖపట్నంలో పెను విషాదం నింపిన గ్యాస్ లీకేజీ వెనుక యాజమాన్య నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నెలన్నరగా మూతపడిన కెమికల్ ఫ్యాక్టరీని లాక్‌డౌన్ నుంచి సడలింపు ఇచ్చారు కదా అని నేరుగా ప్రారంభించడం ప్రజల పాలిట విషశాసనంగా మారింది. ట్యాంకుల్లో భారీ స్థాయిలో నిల్వ ఉన్న రసాయనాలు వేడి వల్ల ఒత్తిడికి గురై లీకైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. పున:ప్రారంభించే ముందు సరైన తనిఖీలు చేసి ఉంటే లీకేజీ బయటపడేది.
బుధవారం ట్రయల్ రన్ వేసి, ఉత్పత్తికి రంగం సిద్ధం చేశారు. రాత్రి పీవీసీ గ్యాస్ లీకైనట్లు అక్కడి నైట్ షిప్ట్ ఉద్యోగి ఒకరు గుర్తించారు. భారీ లీకేజీ జరిగినప్పుడు సాధారణంగా అలారం మోగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాలను అలర్ట్ చేసే సైరన్ వ్యవస్థ కూడా ఉంటుంది. 213 ఎకరాల విస్తీర్ణంలో నెలికొల్పి, రోజూ 412 టన్నుల ప్లాస్టిక్ సామగ్రిని ఉత్పత్తి చేసే ఎల్జీ పాలిమర్స్‌లో ఈ వ్యవస్థలు ఉన్నాయో లేదో తెలియడం లేదు. దీనిపై యాజమాన్యం పెదవి విప్పడంలేదు. ప్రజలు కూడా తమకు ఎలాంటి అలారం శబ్దంగాని, సైరన్ శబ్దంగానీ వినిపించలేదంటున్నారు. లీకేజీని గుర్తించినప్పుడే ఆర్ ఆర్ వెంకటాపురం, దాని చుట్టుపక్కల గ్రామస్తులను సైరన్ ద్వారా హెచ్చరించి ఉంటే ప్రజలు ముందుజాగ్రత్తగా వేరే ప్రాంతానికి వెళ్లి ఉండేవారు. ఫలితంగా ప్రాణనష్టం, అనారోగ్యం తప్పేది. లాక్