సోషల్ మీడియా పుణ్యమో లేదా నలుగురికి డిఫెరెంట్ గా కనబడాలనే కుతుహలమో తెలీదు కానీ ఈ మధ్య కొంత మంది యువతీ, యువకులు హద్దుమీరుతున్నారు. తాజాగా విశాఖలో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. నడిరోడ్డుపై ఏకంగా బరితెగించి ప్రవర్తించింది. బైక్ పై ఒకరిని ఒకరు హత్తుకుంటూ ప్రమాదకరంగా ప్రయాణించారు ఈ లవర్స్. దీంట్లో తప్పేముంది అనుకుంటే పొరపాటే. అందరిలా అమ్మాయి వెనుక కూర్చొని హత్తుకుని కూర్చోలేదు. కొంచెం వెరైటీ కోరుకుంటూ ట్యాంకు మీద కూర్చున్న యువతి ..బైక్ నడుపుతున్న ప్రియుడిని కౌగిలించుకోంది. ప్రపంచంతో తమకు సంబంధం లేదన్నట్టుగా ప్రేమ మైకంలో మునిగిపోయారు. ఈ సమయంలో అతడు హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్నాడు. కాలేజ్ యూనిఫాంలో బైక్ పై లవర్స్ చేస్తున్న రొమాన్స్ ను చూసి రోడ్డుపై వెళ్లేవారు ఆశ్చర్యపోయారు. ఈ జంటను వీడియో తీసి కొంతమంది సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. చివరికి పోలీసుల కంట పడడంతో వారి తిక్క కుదిరింది. బైక్ నంబర్ ఆధారంగా వారిని పోలీసులు గుర్తించారు. బైక్ నడిపిన వ్యక్తి అజయ్‌కుమార్‌ను, యువతి శైలజను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. స్టీల్ ప్లాంట్ మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
విశాఖలో లవర్స్ ఓవర్ యాక్షన్. స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్డుపై పట్టపగలు బరితెగింపు. హెల్మెట్ లేకుండా యువకుడు డ్రైవింగ్. కాలేజ్ యూనిఫామ్ ధరించి విద్యార్థిని వికృత చేష్టలు చూసి నివ్వెరపోయిన స్థానికులు. #AndhraPradesh #Visakhapatnam #Vizag pic.twitter.com/i2dGgHKElg
— Vizag News Man (@VizagNewsman) December 29, 2022