Vizag police sent Saipriya along with her boyfriend
mictv telugu

సాయిప్రియ ఎపిసోడ్ ముగింపు.. ప్రియుడితో పంపేసిన పోలీసులు

July 30, 2022

సంచలనం సృష్టించిన వైజగ్ సాయిప్రియ ఎపిసోడ్ ముగిసింది. మేజర్ కావడంతో ఆమె ఇష్టప్రకారం ప్రియుడితో పోలీసులు పంపేశారు. వారిని కౌన్సిలింగ్ కోసం వైజాగ్‌కు తీసుకొచ్చిన పోలీసులు.. ఆమె భర్త శ్రీనివాస్ పోలీస్ స్టేషనుకి రాకపోవడంతో పై నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సాయిప్రియ సమాజానికి క్షమాపణలు చెప్పింది. శ్రీనివాస్‌తో పెళ్లి ఇష్టం లేదని, చిన్నప్పటి నుంచి రవినే ఇష్టపడ్డానని స్పష్టం చేసింది. అలాగే పెళ్లి రోజు సందర్భంగా శ్రీనివాస్ తనకిచ్చిన బంగారు గాజులను అతనికే ఇచ్చేస్తానని చెప్పింది. అటు ప్రియుడు రవి.. తాను చదువుకున్నానని, ఉద్యోగం చేసి సాయిప్రియను పోషిస్తానని పోలీసుల సమక్షంలో పేర్కొన్నాడు. తమను బతకనివ్వాలని, తమ వల్ల ఇబ్బంది పడిన వారందరికీ ప్రత్యేకంగా క్షమాపణలు చెప్తున్నామని కోరారు. దీంతో పోలీసులు కూడా చేసేదేమీ లేక చట్టప్రకారం వ్యవహరించారు. అయితే సామాజిక విశ్లేషకులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటే హిందూ వివాహ చట్టం ప్రకారం ఆ పెళ్లి చెల్లదని, ఇప్పిటికే సమాజంలో అలా పెళ్లి చేసుకున్న వారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అభిప్రాయపడుతున్నారు. కాబట్టి చట్ట ప్రకారం భర్త శ్రీనివాస్‌కు విడాకులు ఇచ్చి తర్వాత ప్రియుడిని పెళ్లి చేసుకోవాల్సింది అని పలువురు విశ్లేషిస్తున్నారు.