Vizag Visakhapatnam global inverters summit stampede for welcome gifts
mictv telugu

విశాఖ గ్లోబల్ సదస్సులో దొమ్మీ.. వీడియో

March 3, 2023

Vizag Visakhapatnam global inverters summit stampede for welcome gifts

మనం విదేశాలకు వెళ్లినా, విదేశీయులు మన దగ్గరికి వచ్చినా మనదంటూ ఒక స్టైల్ ఉంటుంది. మీ ఇంటికొస్తే మాకేమిస్తావ్, మా ఇంటికొస్తే ఏం తెస్తావ్ టైపులో చాలా వ్యవహారాలు నడుపుతుంటాం. మనం అంటే భారతీయులమనే కాదు, ఈ స్వభావం ఉన్న వాళ్లెవరైనా కావొచ్చు. పైగా ఫ్రీగా వస్తే దృశ్యం మామూలుగా ఉండదు. విశాఖపట్నంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో ఇలాంటి దృశ్యం కనిపించింది. సదస్సుకు వచ్చిన అతిథులకు ఇస్తున్న గిఫ్ట్ ప్యాకుల కోసం జనం వేలంవెర్రిగా ఎగబడ్డాడు. తగినన్ని లేకపోవడంతో దొమ్మీ జరిగింది. డెలిగేట్స్ కౌంటర్ దగ్గర రచ్చరచ్చ చేసి చేతికి దొరికింది ఎత్తుకుపోయారు. పైపులను పీకేశారు. సదస్సుకు వచ్చిన వారికి ఏపీ విశేషాలు గుర్తండేలా డిజైన్ చేసిన ఈ కిట్లలతో కలంకారి డిజైన్ ఉన్న పింగాణీ ప్లేట్, నోట్ బుక్, పెన్నులు, తిరుపతి లడ్డు, అరకు కాఫీ, టీ పొడి, గిరిజన తేనె ఉన్నాయి. వీటి కోసం కోట్లు ఖర్చు చేసింది. అయితే కేవలం 8 వేల కిట్లు మాత్రమే సరఫరా చేయడంతో సరిపోక తోపులాట జరిగింది.