మారువేషంలో కలెక్టర్.. ధరల దందా చూసి..   - MicTv.in - Telugu News
mictv telugu

మారువేషంలో కలెక్టర్.. ధరల దందా చూసి..  

March 31, 2020

Vizianagaram Joint Collector Sudden Visit  

అక్రమార్కుల ఆటకట్టించడానికి ఓ జాయింట్ కలెక్టర్ కొత్త అవతారం ఎత్తాడు. లాక్‌డౌన్ ఆసరాగా చేసుకొని  మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు మారువేషంలో వచ్చి అందరికి ఝలక్ ఇచ్చాడు. అచ్చం సినిమా స్టోరీని తలపించేలా విజయనగరం జిల్లాలో ఇది జరిగింది. ఏకంగా జాయింట్ కలెక్టర్ మారువేశంలో వచ్చి ఆకస్మిక తనిఖీలు చేశారు. దీంతో వ్యాపారులంతా ఒక్కసారిగా అవాక్యయ్యారు. 

లాక్‌డౌన్ కారణంగా బజార్లలో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెంచి అమ్ముతున్నట్టుగా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ దృష్టికి వచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్ముతున్నారా లేదా తెలుసుకోవడానికి ఆయన సరికొత్త ఉపాయం ఆలోచించాడు. సామాన్యుడిలా బనియన్, పంచె  కట్టుకొని మెడలో కండువా వేసుకొని పలు మార్కెట్లను సందర్శించారు. అక్కడ అమ్ముతున్న ధరలను ఆయన పరిశీలించారు. ఎక్కువ ధరలకు అమ్ముతున్నవారిని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలపై తదుపరి చర్యలకు ఉన్నతాధికారులతో సమావేశమై సూచనలు చేశారు. 

మొరాయిస్తున్న రేషన్ సర్వర్లు : 

పేదవారి ఆకలి తీర్చేందుకు ప్రతిష్టాత్మకంగా రేషన్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్వహించింది. కానీ విజయవాడ జిల్లాలో మాత్రం పలు సర్వర్లు పని చేయకపోవడంతో  ప్రజలు వెనుదిరగాల్సి వస్తోంది.పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఇదే తంతు జరుగుతుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో రేషన్ విషయంలో డీలర్లకు, ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది.