పుతిన్ కాళ్లకు ఏమైంది.. క్యాన్సర్ నిజమేనా? - MicTv.in - Telugu News
mictv telugu

పుతిన్ కాళ్లకు ఏమైంది.. క్యాన్సర్ నిజమేనా?

May 10, 2022

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. డాక్టర్లు ఆయనకు తప్పనిసరిగా సర్జరీ చేయాలని, సర్జరీ వల్ల కొంతకాలం పాటు పుతిన్ శారీరకంగా బలహీనంగా మారతారని కూడా కథనాలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ.. ఆయన అనారోగ్యంపై మరిన్ని సందేహాలు రేకెత్తించేలా… ఇటీవల విక్టరీ డే వేడుకల్లో కాస్త భిన్నంగా కనిపించారు పుతిన్.

మందంగా ఉన్న దుప్పటితో కాళ్లను కప్పుకుని దర్శనమిచ్చారు. అంతేకాదు, పుతిన్ దగ్గుతూ కనిపించాడని, అక్కడున్న వారందరిలో చలి నుంచి కాపాడుకోవడానికి అదనపు దుస్తులు ధరించింది పుతిన్ ఒక్కడేనని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. సమావేశంలో టేబుల్ ను గట్టిగా పట్టుకుని కూర్చుని ఉన్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీటింగ్ జరిగినంత సేపు పుతిన్ టేబుల్ ను పట్టుకునే ఉండడం వీడియోలో కనిపించింది.