కరోనా ఎఫెక్ట్..ఊడుతున్న వోడాఫోన్ ఐడియా ఉద్యోగాలు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ఎఫెక్ట్..ఊడుతున్న వోడాఫోన్ ఐడియా ఉద్యోగాలు

August 4, 2020

Vodafone Idea lays off 1500 employees

కరోనా వైరస్ ప్రభావం టెలికాం రంగంపై కూడా పడుతోంది. దీంతో టెలికాం సంస్థలు నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొని సంస్థలు ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. తాజాగా ఆర్థిక నష్టాల కారణంగా వోడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏజీఆర్ బకాయిల భారానికి తోడు నెట్ వర్క్ విస్తరణ పనులు నిలిచిపోవడం, డీల్స్ ఆలస్యం తదితర కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసినట్టు తెలుస్తోంది. 

ఖర్చులను తగ్గించుకునే క్రమంలో దేశవ్యాప్తంగా దాదాపు 1500 మంది ఉద్యోగులను తొలగించినట్టు సమాచారం. అలాగే మే నెలలో 22 టెలికాం సర్కిల్స్ ను 10కి కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వోడాఫోన్ ఐడియాకు సంబంధించి నోకియా, ఎరిక్సన్, హువావే, జెడ్‌టిఇ 4జీ పరికరాల కొత్త ఆర్డర్లు ఆలస్యం అయ్యాయి. అలాగే చైనా నుంచి కొత్త ఆర్డర్‌లను తీసుకోవడం కూడా ఆగిపోయాయి. కరోనా వైరస్ కారణంగా ఈ త్రైమాసికంలో చందాదారుల సంఖ్య భారీగా పడిపోయింది.