Vodafone Idea offering fancy numbers to customers
mictv telugu

వొడాఫోన్ ఐడియా వీఐపీ ఫ్యాన్సీ నెంబరు.. ఆన్‌లైన్లో రూ. 500 లకే

September 10, 2022

సిమ్ నెంబర్ ఫ్యాన్సీగా ఉండాలని అందరూ కోరుకుంటారు. మంచి నెంబరు కనిపిస్తే తీసేసుకోవాలని చాలా మందికి కోరికగా ఉంటుంది. కానీ, అవి అందరికీ అందుబాటులోకి ఉండేది కాదు. ఇలాంటి వారి కోసం వొడాఫోన్ ఐడియా ఫ్యాన్సీ నెంబర్లను కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. ఫోన్ నెంబర్ ప్రత్యేకంగా ఉండాలని, ఎవరు చూసినా ఇది ఫలానా వారి నెంబరు అని ఠక్కున గుర్తుకు వచ్చేలా ఉండాలని భావించే వారికి వొడాఫోన్ ఐడియా కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ అవకాశం ఆన్‌లైన్లో కూడా కల్పించడం విశేషం. ప్రిపెయిడ్, పోస్ట్ పెయిడ్ నెంబర్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ సర్వీసు అంతా ఉచితంగా అందడం మరో విశేషం. ఫ్యాన్సీ నెంబరు కోరుకునే వారు వొడాఫోన్ ఐడియా అధికారిక వెబ్ సైటుకు వెళ్లాలి. అక్కడ న్యూ కనెక్షన్‌ను సెలెక్ట్ చేసుకొని తర్వాత ఫ్యాన్సీ నెంబర్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. దాంతో కొత్త వెబ్ పేజీ తెరుచుకుంటుంది. అందులో ప్రిపెయిడా, పోస్ట్ పెయిడా అని అడుగుతుంది. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాక, మీ ఏరియా పిన్ కోడ్ అడుగుతుంది. అది ఇచ్చాక నెంబర్ల జాబితా కనపడుతుంది. మీకు నచ్చిన నెంబర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. దీంతో పాటు వీఐపీ ఫ్యాన్సీ నెంబర్ల జాబితా కూడా ఉంటుంది. ఈ నెంబర్ కావాలంటే రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెంబర్లు మరింత ప్రత్యేకంగా ఉంటాయి.