Vodafone Idea Special Plan Free Data on the occasion of Republic Day
mictv telugu

రిపబ్లిక్ డే సందర్భంగా వొడాఫోన్ ఐడియా స్పెషల్ ప్లాన్…ఫ్రీ డేటా పొందే అవకాశం..!

January 26, 2023

Vodafone Idea Special Plan Free Data on the occasion of Republic Day

నేడు రిపబ్లిక్ డే సందర్భంగా…టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ వొడాఫోన్, ఐడియా తన కస్టమర్లకు స్పెషల్ గిఫ్టును అందించింది. వొడాఫోన్, ఐడియా కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ లో ఫ్రీడేటాతోపాటు, కస్టమర్లకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. మీరు కూడా వొడాఫోన్, ఐడియా కస్టమర్లు అయితే కంపెనీ కొత్త ప్లాన్ ప్రయోజనాన్ని పొందేందుకు మీరు ఈ ప్యాక్ గురించి మరింత సమాచారం తెలుసుకోవల్సిందే.

రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్ ప్లాన్ను కొంతమంది వినియోగదారులకు మాత్రమే ప్రవేశపెట్టింది. ప్రీ పెయిడ్ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్లాన్ తీసుకువచ్చింది. అంటే పోస్టు పెయిడ్ సర్వీసును ఉపయోగించే కస్టమర్లు కంపెనీ ప్రత్యేక ఆఫర్ ప్లాన్ను ఉపయోగించుకోలేరు. దీంతోపాటు రీఛార్జ్ కోసం కంపెనీ వీఐ యాప్ ను ఉపయోగించే కస్టమర్ల కోసం ఈ ప్లాన్ను పరిచయం చేసింది. ప్రత్యేక ఆఫర్ ప్లాన్ లో కంపెనీ కస్టమర్లకు అదనపు ఛార్జీ లేకుండా అదనపు డేటా ప్రయోజనాన్ని అందిస్తోంది. కంపెనీ కస్టమర్లకు అదనపు డేటాను అందిస్తోంది. దీని కోసం కంపెనీ ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదు.

ఎంతకాలం ప్రత్యేక ఆఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు?

కంపెనీ ప్రత్యేక ఆఫర్‌లో, కస్టమర్‌లు రూ. 299 అంతకంటే ఎక్కువ ప్యాక్‌లపై 5 GB అదనపు డేటా ప్రయోజనం పొందుతారు. అదే సమయంలో, రూ. 199 రీఛార్జ్, రూ. 299 వరకు రీఛార్జ్‌పై 5 GB అదనపు డేటా అందిస్తుంది. రిపబ్లిక్ డే స్పెషల్ ప్లాన్ ఆఫర్‌లో ఇచ్చిన అదనపు డేటా 28 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుందని కంపెనీ తెలిపింది.