వోడాఫోన్ కొత్త ప్లాన్.. రూ.99కే అన్‌లిమిటెడ్ కాలింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

వోడాఫోన్ కొత్త ప్లాన్.. రూ.99కే అన్‌లిమిటెడ్ కాలింగ్

January 16, 2020

vgcf

దేశంలో మొబైల్ నెట్‌వర్క్ సంస్థల మధ్య పోటీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకోవడానికి వోడాఫోన్ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. వొడాఫోన్ కొత్తగా రూ.99, రూ.555 రుసుముతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. వొడాఫోన్ లాంచ్ చేసిన రూ.99 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 18 రోజులుగా ఉంది. 

మొత్తంగా 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ అందిస్తారు. ఇక అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే జీ5 సబ్ స్క్రిప్షన్‌‌ను ఉచితంగా అందిస్తారు. దీంతో పాటు వొడాఫోన్ ప్లే కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. వొడాఫోన్ కొత్తగా ప్రవేశపెట్టిన మరో ప్లాన్ రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజులు. రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. వీటితో పాటు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. పై ప్లాన్ తరహాలోనే జీ5, వొడాఫోన్ ప్లే సబ్ స్క్రిప్షన్లు కూడా లభిస్తాయి.