అక్క ,చెల్లెండ్లుగా ఉన్న అత్తకోడళ్లు... - MicTv.in - Telugu News
mictv telugu

అక్క ,చెల్లెండ్లుగా ఉన్న అత్తకోడళ్లు…

August 10, 2017

వోగ్ బ్యూటీ అవార్డ్స్ ఫంక్షన్ ముంబాయిలో జరిగింది. అభిషేక్ తప్ప , అమితాబ్ బచ్చన్ కుటుంబం మెుత్తం హాజరు అయ్యారు. కానీ ఈవెంట్ లో కుటుంబం మెుత్తంలో ఐశ్వర్యరాయ్, అమితాబ్ పెద్ద మనవరాలు నవ్య నవేలీ నంద అట్రాక్షన్ గా నిలిచారు. ఎప్పటిలాగే ఐశ్వర్య తన డ్రెసు, అలంకరణతో వీక్షకులను కట్టిపడేసింది. అయితే ఈసారి నవ్య కూడా తన అత్తకు ఏ మాత్రం తగ్గకుండా స్కైబ్లూ గౌనులో మెరిసింది. నవ్య బయట జరిగే కార్యక్రమాలకు హాజరుకాదు. కాని తన కుంటుంబం మెుత్తం వెళ్తూంది కావున నవ్య కూడా కుంటుంబంతో కలసి ఈవెంట్లో మెరిసిందట. అయితే నవ్య తన మేనత్త ఐశ్వర్య పక్కన కూర్చుని మాట్లాడుతున్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దానితో ఈ ఫోటో కాస్తా వైరల్ అయింది. నెటిజన్లు ఈ ఫోటోకు చాలా లైక్లు. కామెంట్లు ఇస్తున్నారు. ఐశ్వర్య, నవ్య మేనత్తకోడళ్లగా కాకుండా అక్కచెల్లెళ్లుగా కనిపిస్తున్నారని, ఐశ్వర్య అందం ఏ మాత్రం తగ్గలేదని నెటిజన్లు పొగిడేస్తున్నారు.