వీడియో : న్యాయం చేయలేని జాబ్ వద్దంటూ చెప్పుతో కొట్టుకున్న వాలంటీర్ - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : న్యాయం చేయలేని జాబ్ వద్దంటూ చెప్పుతో కొట్టుకున్న వాలంటీర్

June 21, 2022

తన వార్డులోని రైతులకు పంటల బీమా డబ్బులు రాకపోవడంతో నగేశ్ నాయక్ అనే వాలంటీర్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. రైతులకు న్యాయం చేయలేని ఈ జాబ్ వద్దంటూ తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. సత్యసాయి జిల్లా కదిరి మండలంలో ఈ సంఘటన జరిగింది. రాందాస్ నాయక్ తండాలో 52 మంది రైతులు పంట బీమా చేయిస్తే కేవలం ఒక్కరికి మాత్రమే వచ్చిందని, అదీ పంట వేయని రైతుకు ఇచ్చారని అధికారుల ముందు వాపోయాడు. మిగిలిన రైతులు తమకెందుకు బీమా డబ్బులు రాలేదని నిలదీస్తున్నారని, వారికి న్యాయం చేయాలని కోరాడు. అయితే వ్యవసాయ అధికారులు, సచివాలయ సిబ్బంది పట్టించుకోకపోవడంతో అసహనానికి లోనై ‘తండాకు వెళ్తే రైతులు చెప్పుతో కొట్టేలా ఉన్నారు. దానికంటే నా చెప్పుతో నేనే కొట్టుకోవడం బెటర్’ అంటూ కొట్టుకున్నాడు. తనకు ఈ వలంటీర్ ఉద్యోగమే వద్దని, రాజీనామా చేసేస్తానని కరాఖండీగా చెప్పేశాడు.