ఓటుకు నోటు కేసు… రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు… - MicTv.in - Telugu News
mictv telugu

ఓటుకు నోటు కేసు… రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు…

September 27, 2018

మూడున్నరేళ్ళ క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది.నేటి ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించారు. ఓటుకు కోట్లు కేసు, జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసులో భాగంగా ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన రెండు ఐటీ బృందాలు(11మంది అధికారులు) ఈ దాడులు నిర్వహించాయి. రేవంత్ రెడ్డి ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.ఆయన బంధువులు, సన్నిహితులైన 15 మంది ఇళ్ళు, కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు.Vote to note on screen again ... IT attacks on Revant Reddy's house …అప్పట్లో రేవంత్ రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న రూ. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయమై జరుపుతున్న విచారణలో భాగంగానే దాడులు చేస్తున్నట్టు సమాచారం. ఏసీబీ ఫిర్యాదుతో రేవంత్ రెడ్డిపై కేసు పెట్టిన ఈడీ, హైదరాబాద్ పోలీసుల సహకారంతో ఈ దాడులు నిర్వహిస్తోంది. రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించిన పలు కంపెనీ లావాదేవీలపై కూడా ఐటీ దాడులు జరిపారు.