మిల్క్ ప్యాకెట్లపై ఎన్నికల ప్రచారం - MicTv.in - Telugu News
mictv telugu

మిల్క్ ప్యాకెట్లపై ఎన్నికల ప్రచారం

March 16, 2019

ఏప్రిల్ 11 న ప్రారంభం కానున్న సార్వత్రిక ఎన్నికలకు దేశం మొత్తం సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో 100 శాతం ఓటింగ్ పెంచడానికి తమిళనాడు ఎన్నికల సంఘం వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తమిళనాడు రాష్ట్రంలో వచ్చే నెల 18 న లోక్‌సభ స్థానంలతో పాటు 18 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఓటు ఆవశ్యకతను పెంపొందించడానికి పుదుచ్చేరి ఎన్నికల శాఖ తరపున వివిధ ప్రకటనలు చేపట్టారు. ఇందులో భాగంగా పుదుచ్చేరి ప్రభుత్వ పాల సహకార సంస్థ విక్రయించే పాల ప్యాకెట్లపై ఓటు ముక్యమైనది, తప్పక ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి అనే స్లోగన్‌ను ముద్రించి పంపిణీ చేస్తున్నారు.

Voters awareness` through messages on milk sachets