voting caluculations of bigboss 6 contestants. Bigboss 6
mictv telugu

ఈ వారంతో శ్రీసత్య గోల తప్పనుందా?

November 23, 2022

వారం వారం గుడుస్తున్న కొద్దీ బిగ్ బాస్ లో లెక్కలు మారుతున్నాయి. అసలు వ్యక్తిత్వాలు బయటకు లాగడమే ఉద్దేశం అన్నట్టు ఉండే బిగ్ బాస్ లో రాను రాను ఒక్కొక్కరూ ఎలాంటి వారో తేటతెల్లం అవుతోంది. బాటమ్ లైన్ లో ఉన్నవారు సడన్ గా టాప్ లోకి దూసుకువస్తుంటే….టాప్ లో ఉంటారు అనుకున్నవారు అట్టడుగుకి పడిపోతున్నారు. లాస్ట్ వీక్ వీక్ మెరీనా వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా రోహిత్ లైమ్ లైట్ లోకి దూసుకువచ్చాడు. మెరీనా ఓట్లను కూడా తన బలంగా చేసుకుంటూ….ఇంట్లో అందరి కంటే మంచి వ్యక్తిత్వంతో, మెచ్యూర్డ్ బిహేవియర్ తో దూసుకుపోతున్నాడు. ప్రేక్షకులు కూడా రోహిత్ అంటే ఇష్టం చూపిస్తున్నారు. రోహిత్ ఇలానే ఉంటే కనుక బిగ్ బాస్ ఫైనల్ విజేత అయినా ఆశ్యర్యపోనక్కరలేదు.

ఈవారం నామినేషన్స్‌లో మొత్తం ఏడుగురు ఉన్నారు. ఆదిరెడ్డి, రోహిత్, శ్రీహాన్, శ్రీసత్య, రాజ్, ఇనయ, ఫైమా ఈ ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే రేవంత్ కెప్టెన్ కావడం వల్ల ఈవారం నామినేషన్స్ నుంచి సేవ్ కాగా.. గత కొన్నివారాలుగా నామినేషన్స్‌లోకి వస్తున్న కీర్తికి కూడా ఈవారం నామినేషన్స్ నుంచి రిలీఫ్ లభించింది. దీంతో మిగిలిన ఏడుగురు ఓటింగ్‌లో నువ్వా నేనా అంటూ పోటీపడుతున్నారు. ప్రస్తుతానికి ఒకరోజు గడిచేసరికి ఇనయ సుల్తానా టాప్‌ లో ఉంది. అత్యధిక ఓటింగ్‌తో దూసుకుని పోతోంది. రేవంత్ నామినేషన్స్‌లో ఉంటే ఇనయ సుల్తానా గట్టి పోటీ ఇచ్చేది. కానీ ఇప్పుడు అతను నామినేషన్స్‌లో లేకపోవడంతో ఇనయ 26 శాతం ఓట్లతో నెం.1లో ఉంది. పైగా ఈవారం కీర్తి నామినేషన్స్‌లో లేకపోవడం కూడా ఆమెకు బాగా కలిసి వచ్చే అంశం. వీళ్లిద్దరి మధ్య బాండింగ్ ఉండటం వల్ల.. కీర్తి ఫ్యాన్స్ ఓట్లు ఇనయకి షేర్ అవుతాయి.

ఇనయ తర్వాత రోహిత్ 20 శాతం ఓట్లతో రెండో ప్లేస్‌కి వచ్చేశాడు. మెరీనా ఉన్నప్పుడు ఓట్లు ఇద్దరికీ మధ్య చీలిక అయ్యేవి దాంతో రోహిత్‌కి తక్కువ ఓట్ల శాతం వచ్చేది. కానీ ఇప్పుడు మెరీనా హౌస్‌ల లేకపోవడంతో రెట్టింపు వేగంతో దూసుకునిపోతున్నాడు రోహిత్. హౌస్‌లో ఉన్న వాళ్లలో మిస్టర్ పర్ఫెక్ట్‌గా, విన్నర్ మెటీరియల్‌గా ఉన్న రోహిత్‌‌కి ఒక్కసారిగా ఓటింగ్ శాతం పెరిగింది. రోహిత్ కు ఇది చాలా కీలకమైన స్టెప్.

ఇక మూడో స్థానంలో 15 శాతం ఓట్లతో శ్రీహాన్ ఉన్నాడు. ఇతనికి రేవంత్ ఫ్యాన్స్ ఓట్లు పడుతున్నప్పటికీ.. ఇతని బిహేవియర్‌ వల్ల మూడో స్థానానికి పడిపోయాడు. అయితే ఈ మూడో స్థానానికి ఆదిరెడ్డి నుంచి గట్టి పోటీ ఉంది. ఆదిరెడ్డి కూడా కొన్ని పోల్స్‌లో మూడో స్థానంలో ఉంటే.. శ్రీహాన్ నాలుగో స్థానానికి పడిపోయాడు. ఈ ఇద్దరూ 15 శాతం ఓట్లతో మూడో స్థానానికి పోటీ పడుతున్నారు.

ఇక రాజ్ విషయానికి వస్తే….ఇతను కూడా ఓటింగ్ లో పరుగులు పెడుతున్నాడు.పెద్దగా ఫ్యాన్ బేస్ లేకపోయినప్పటీ.. రాజ్‌కి 12 శాతం ఓట్లు పడుతున్నాయి. దీంతో రాజ్ ఐదో స్థానంలో ఎలిమినేషన్‌కి దూరంగా ఉన్నాడు. ఎటొచ్చీ.. ఇప్పడు రిస్క్ అంతా ఫైమా, శ్రీసత్యలకే. ఈ ఇద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారు. శ్రీసత్యకు ఇప్పటివరకు 7 శాతం ఓట్లు పడితే , ఫైమాకి కేవలం 5 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా మూడు రోజులు పాటు ఓటింగ్ మిగిలి ఉంది కాబట్టి.. తొలి ఐదు స్థానాల్లో ఉన్న వారి ఓటింగ్ శాతాల్లో అటు ఇటుగా మార్పులు వచ్చినా.. లీస్ట్‌లో ఉన్న శ్రీసత్య, ఫైమాలు మాత్రం డేంజర్ జోన్‌ నుంచి తప్పించుకోలేరు.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది. అది తన కోసం ఉపయోగించుకుని సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కొంచెం ట్రికీ పాయింట్ ఉంది. ఫైమా ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉండి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించుకుని సేవ్ అవుతుంది తప్పకుండా. అప్పుడు ఫైమాతో పాటూ శ్రీసత్య కూడా సేవ్ అయిపోతుంది. ఎందుకంటే శ్రీసత్య కన్నా ఫైమా లీస్ట్ కాబట్టి. కానీ శ్రీసత్య లీస్ట్‌లోకి వస్తే మాత్రం.. ఫైమా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా సేవ్ అయినా లీస్ట్‌లో ఉన్న శ్రీసత్య ఎలిమినేట్ కావడం ఖాయం. అంటే శ్రీసత్య.. బిగ్ బాస్‌లో ఉండాలా? వెళ్లాలా అన్నది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి ఫైమాకి వచ్చిన ఓటింగ్.. రెండు ఆమె ఉపయోగించుకునే ఎవిక్షన్ పాస్. ఈ రెండింటిలో ఏది తేడా కొట్టినా.. శ్రీసత్య గెటౌట్ అయిపోవడం ఖాయం.

ఇప్పడు శ్రీ సత్య భవిష్యత్తు అంతా ప్రేక్షకుల చేతిలో ఉంది. ఆమె ఓవరాక్షన్ ను ఇంకా కావాలనుకుంటున్నారా? లేక వద్దురా బాబూ ఈవిడని భరించలేము అనుకుంటున్నారా అన్నది ఈ వారం తేలుతుంది. శ్రీసత్య ఎలిమినేట్ అయితే కాస్త శ్రీహాన్ కూడా దారిలోకి వస్తాడు. అప్పుడైన సరిగ్గా ఆడే ఛాన్స్ లు ఉంటాయి. దానివల్ల అతని ఓట్లు మెరుగయ్యి ఐనల్ విన్నర్ అవుతాడో లేదో తెలియదు కానీ కనీసం చివరి ఎపిసోడ్ వరకు అయినా ఉండే అవకాశం లభిస్తుంది.