వీఆర్వో కాలర్ పట్టుకున్న వృద్ధురాలు.. అతడు అమానుషంగా - MicTv.in - Telugu News
mictv telugu

వీఆర్వో కాలర్ పట్టుకున్న వృద్ధురాలు.. అతడు అమానుషంగా

August 30, 2019

అధికార మదంతో మహిళ అని కూడా చూడకుండా ఓ వీఆర్వో ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది.  ఓ వృద్ధురాలి పేరుతో ఉన్న భూమిని ఆమెకు తెలియకుండా వేరేవారికి పట్టా చేయడమే కాకుండా ఆమె వద్ద కూడా డబ్బులు తీసుకొని మోసం చేశాడు. ఇదేంటని కాలర్ పట్టుకొని ప్రశ్నించిన పాపానికి అంతా చూస్తుండగానే ఆమెను నెట్టి వెల్లిపోయాడు. స్పృహకోల్పోయిన పెద్దావిడను హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా మేడుకుందకు చెందిన పోచమ్మకు బీరయ్య అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఇద్దరు భార్యలు చనిపోవడంతో బీరయ్య పోచమ్మను మూడో వివాహం చేసుకున్నాడు. ఇటీవల బీరయ్య కూడా చనిపోవడంతో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. ఆమె పేరుపై ఉన్న మూడెకరాల భూమిపై సవతి కొడుకు కన్ను పడింది. సమగ్ర భూ ప్రక్షాళనలో బీరయ్య మొదటి భార్య కొడుకు, పోచమ్మ చిన్న కొడుకుతో కలిసి భూమి కాజేసేందుకు పథకం వేశాడు. రాములు వీఆర్వో సహకారంతో ఎవరికీ తెలియకుండా ఇరువురు కలిసి భూమిని వారి పేరుమీదకు మార్చుకున్నారు. పోచమ్మ చినిపోయినట్టుగా సృష్టించి ఈ తతంగం నడిపించారు. తీరా పోచమ్మకు ఈ విషయం తెలియడంతో వీఆర్వో రామలింగంను నిలదీసింది. 

ఆమె భూమిని తిరిగి తన పేరుమీదకు ఎక్కిస్తానని చెప్పి డబ్బులు కూడా తీసుకున్నాడు. ఏడాదిగా పట్టా చేయకుండా వాయిదా వేస్తూ వస్తున్నాడు. అతని చర్యతో విసిగిపోయిన పోచమ్మ వట్‌పల్లి మండల తహసిల్దార్‌ కార్యాలయం వద్ద కాలర్ పట్టుకొని నిలదీసింది. ‘డబ్బులు ఇచ్చి ఏడాదిగా పట్టా కోసం నీ చుట్టూ తిరుగుతున్నా పని ఎప్పుడు చేస్తావంటూ’ ఆగ్రహం వ్యక్తం చేసింది.  కోపంతో ఊగిపోయిన వీఆర్వో ఆమెను వెనక్కి తోసి వెళ్లిపోయాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పోచమ్మ డిమాండ్ చేస్తోంది.