తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో వీఆర్ఒలుగా విధులు నిర్వహిస్తున్న వారి పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ, వారికీ ప్రమోషన్లు, పే స్కేల్, డబల్ బ్రెడ్ రూం ఇండ్లను పెంచాలని, కట్టించాలని లేఖలో రాశారు.
రేవంత్ రెడ్డి పేర్కొన్న ప్రధాన అంశాలు..
1. మీ ప్రభుత్వంలో వీఆర్ఒల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైంది.
2. గొడ్డు చాకిరీ చేయించుకుని, వాళ్ల హక్కులను కాలరాస్తున్నారు.
3. చాలీచాలని జీతాలు, ఏళ్ల తరబడి ప్రమోషన్లు లేక వారి పరిస్థితి దుర్భరంగా ఉంది.
4. వీఆర్ఒలకు పే స్కేల్ అమలు చేస్తామని చెప్పి, చేయలేదు.
5. హామీలు ఇవ్వడం తప్ప, అమలు చేయాలన్న సోయి మీకు లేదు.
6. శేషాద్రి కమిటీ ఓ కంటి తుడుపు చర్య.
7. వీఆర్ఒలకు తక్షణమే పే స్కేల్ అమలు చేయాలి.
8. అర్హులైన వీఆర్ఒలకు పదోన్నతులు కల్పించాలి.
9. వాళ్లకు సొంత గ్రామాలలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలి.
10. విధి నిర్వహణలో చనిపోయిన వీఆర్ఒల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ పది ప్రధానమైన అంశాలతో బహిరంగ లేఖను రాశారు.