వీయు ప్రీమియం 4కె టీవీ లాంచ్..ధర తక్కువ..ఫీచర్లు ఎక్కువ - MicTv.in - Telugu News
mictv telugu

వీయు ప్రీమియం 4కె టీవీ లాంచ్..ధర తక్కువ..ఫీచర్లు ఎక్కువ

March 15, 2020

Vu Premium 4K TV Range Launched

ప్రముఖ టీవీల ఉత్పత్తిదారు వియు ఆధునిక టెక్నాలజీతో ప్రీమియం 4కె టీవీని రూపొందించింది. దీన్ని ఇటీవల భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా వియు టెలివిజన్‌ సీఈఓ దేవిత సరఫ్‌ మాట్లడుతూ.. ‘ఈ ప్రీమియం 4కె టీవీలో లేటెస్ట్ ఫీచర్స్‌ను, నూతన హంగులతో డిజైన్‌ చేశారు. దీన్ని 3 మూడు సైజులో (43, 50, 55 అంగుళాలు) తయారు చేశాం. ఆండ్రాయిడ్‌ 9.0తో, ప్రత్యేకమైన డాల్బీ సౌండ్‌ సిస్టమ్‌తో రూపొందించాం’ అని తెలిపింది.

ఈ టీవీలు ఆండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్, మాక్, విండోస్ లేదా క్రోమ్ బుక్‌కి కనెక్ట్ చేయడానికి గూగుల్ క్రోమ్ కాస్ట్‌ సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ఫేస్‌బుక్, సోనీ లివ్, ఎఎల్‌టి బాలాజీల యాప్‌లు ఈ టీవీలు ఆక్సెస్ చేస్తాయి. ముఖ్యంగా, యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌లో 4కె కంటెంట్‌ను ఈ టీవిలో చూడచ్చు. ఈ టీవీ కనెక్టివిటీ ఆప్షన్‌లో వై-ఫై, ఈథర్నెట్, బ్లూటూత్, 3 హెచ్‌డిఎంఐ పోర్టులు ఉన్నాయి. ఈ టీవీ ద్వారా రెండు 10W బాక్స్ స్పీకర్, డి‌టి‌ఎస్ సపోర్ట్‌తో ఇంటర్నల్ డాల్బీ సౌండ్‌బార్, ఇతర ఫీచర్లలో హెడ్‌ఫోన్ జాక్, వాయిస్ కంట్రోల్డ్ రిమోట్ లభిస్తాయి. ఈ టీవీ ధరల విషయానికి వస్తే.. 43-అంగుళాల, 49-అంగుళాల, 55-అంగుళాల ధరలు వరుసగా రూ .36,999, రూ .46,999, రూ .55,999 గా నిర్ణయించారు. ఈ టీవీలు మార్చి 16 అర్ధరాత్రి నుండి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ అవుతాయి.

వియు ప్రీమియం 4కె టీవీ ఫీచర్లు

* 3840×2160 పిక్సెల్ రిజల్యూషన్‌ 

* 60Hz రిఫ్రెష్ రేటు

* క్వాడ్-కోర్ ప్రాసెసర్,

* 2.5 జీబీ ర్యామ్,

* 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 

* డైనమిక్ కాంట్రాస్ట్ డిస్ ప్లే,

* హై బ్రైట్ మోడ్,

* స్మూత్ మోషన్ కంట్రోల్,

* వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌.