వావ్.. నింగి మధ్యలో సెల్ఫీ కర్రపై వాలిన రాబందు   - MicTv.in - Telugu News
mictv telugu

వావ్.. నింగి మధ్యలో సెల్ఫీ కర్రపై వాలిన రాబందు  

October 17, 2020

Vulture Hitches Ride on Selfie Stick

పారాగ్లైడింగ్ చేస్తూ గాల్లో  తేలియాడుతుండగా ఇద్దరు వ్యక్తులకు ఊహించని అనుభవం ఎదురైంది. ఆకాశం మధ్యలో ఓ రాబందు సెల్ఫీ కర్రపై వాలింది. అంతే కాకుండా వారితో పాటు కొంత దూరం కూడా ప్రయాణం చేసింది. సెల్ఫీ వీడియో తీసుకుంటుండగా ఇది జరిగింది. అది ఏ మాత్రం పట్టుతప్పకుండా స్టిక్‌తో పాటే ప్రయాణం చేసిన విధానం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇదేలా సాధ్యమైంది అని కామెంట్లు పెడుతున్నారు. స్పెయిన్‌లో ఇది చోటు చేసుకుంది. 

దక్షిణ పర్వతాలపై ఇద్దరు పారాగ్లైడింగ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉండగా ఓ రాబందు వచ్చి వాలింది. వాళ్లు దాన్ని ఏమి అనకుండా అలాగే ఉండిపోవడంతో కొంత సేపటికి ఎగిరిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకున్నారు. రాబందు అలా వాలడానికి కారణం కూడా ఉందని పలువురు పేర్కొంటున్నారు. పక్షులు గాల్లో ఎగిరే సమయంలో అలసిపోవడం వల్ల మధ్య మధ్యలో ఏదైనా చెట్టు, ఇతర వస్తువులపై వాలుతూ ఉంటాయి. అలాగే రాబందుకు సెల్ఫీ స్టిక్ కనిపించడంతో వాలిపోయింది. తిరిగి ఎగిరేందుకు శక్తిని కూడగట్టుకోగానే దాని దారిలో అది వెళ్లిపోయింది. ఈ వీడియోను నెటిజన్లు తెగ ఆసక్తిగా చూస్తున్నారు. కొందరు మాత్రం అది ఇది వరకే శిక్షణ ఇచ్చిన పక్షిగా అభిప్రాయపడుతున్నారు.