ఈ వీవీఐపీ చెట్టు రక్షణకు 12 లక్షలు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ వీవీఐపీ చెట్టు రక్షణకు 12 లక్షలు..

July 13, 2017

అనగనగా ఓ రావి చెట్టు… దేశం కానీ దేశం నుంచి వచ్చి వీవీఐపీ నాటాడు. అందుకే ఈ చెట్టు సంరక్షణకు ఏటా 12 లక్షల ఖర్చు చేస్తున్నారు. ఆశ్చర్యమేసినా విస్మయం కలిగించే నిజం. ఈ పని చేస్తున్న సర్కార్ ఏదో తెలుసా మధ్యప్రదేశ్ ప్రభుత్వం. రైతుల్ని పట్టించుకునే తీరిక, ఓపిక లేదుగానీ ఒకే ఒక్క చెట్టు రక్షణకు లక్షలు తగులేస్తోంది. ఇంతకీ ఆ చెట్టు ఎవరు నాటారంటే..?

మన చెలకలో చెట్లకు ఏ రక్షణ ఉండదు..వాటి అంతటా అవే పెరుగుతున్నాయి. ఎండకు ఎండి వానకు నానుతాయి.అన్నదాత దానికి ఏలాంటి పొదన చేయడు..కనీసం ఏ రోజు నీళ్లు కూడా పోయడు..కానీ చెట్లు భలే ఏపుగా పెరుగుతాయి. పది ఇరవై కాదు..వందలు,వేల చెట్లు ఇలాగే పెరుగుతాయి. కానీ మధ్య ప్రదేశ్ సర్కార్ కు ఒకే ఒక్క చెట్టు పెంచడానికి ఏటా 12 లక్షలు భూమిలో పోస్తోంది.

ఎంతో పవిత్రంగా భావించే ఈ రావి చెట్టును ఐదేళ్ల క్రితం అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సె నాటారట.అందుకే దీని సంరక్షణకు ప్రత్యేక వాటర్‌ ట్యాంక్‌ ఏర్పాటు చేశారు. అంతేకాదు పురుగులు పట్టకుండా, వాడిపోకుండా ఉండడానికి మధ్యప్రదేశ్‌లోని అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌కి చెందిన బొటానిస్ట్‌ని కూడా ఏర్పాటుచేశారు. ఈ చెట్టు చుట్టూ కంచె వేసి 24 గంటలూ ఇద్దరు గార్డులు కాపలా ఉంటారు.

ఈ అపురూపమైన రావి చెట్టును చూసేందుకు ఇంతకుముందు జనం కూడా వచ్చేవారు..ఇప్పుడు వాళ్లు కూడా రావడం లేదట. ఈ చెట్టుకి పెట్టే ఖర్చులో సగం ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పంటలకు ఖర్చు పెట్టి ఉంటే బాగుండేదని జనం మండిపడుతున్నారు. నిజమే కదా… ఒక్క చెట్టు పెంచడానికి ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం ఏముందో… ఒక్క చెట్టుకే ఇంత ఖర్చు పెడితే…కోట్ల మొక్కలు నాటుతున్న మన కేసీఆర్ సార్ ఎంత పెట్టాలి ఈ లెక్కన..బాపూరే..