ఏపీ ప్రభుత్వ పాఠశాలలో వీవీప్యాట్స్ స్లిప్పుల కలకలం - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ ప్రభుత్వ పాఠశాలలో వీవీప్యాట్స్ స్లిప్పుల కలకలం

April 16, 2019

నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వీవీప్యాట్ స్లిప్పులు బయటపడ్డాయి. ఈ అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు టీడీపీ పార్టీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై పోరాటం చేస్తుండగా.. మరోవైపు వీవీప్యాట్‌లు బహిరంగ ప్రదేశంలో పడి ఉండడం చర్చనీయాంశం అయింది. పాఠశాల ఆవరణలో వీవీప్యాట్ స్లిప్పులను గమనించిన ఓ విద్యార్థి.. వాటిని అధికారులకు అప్పగించాడు.

Vvpat found in school premises in Nellore district.

దీంతో రంగంలోకి దిగిన ఆర్డీవో వెంటనే స్కూల్‌ను పరిశీలించారు. అక్కడే స్కూల్ ఆవరణలో ప్లాస్టిక్ కవర్లలో మరికొన్ని స్లిప్పులు దొరికాయి. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు విచారణకు ఆదేశించారు. స్కూల్ ఆవరణలో దొరికినవి.. మాక్ పోలింగ్ స్లిప్పులు కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. వాటిని కూడా భద్రపరచాల్సి ఉన్నా.. ఇలా నిర్లక్ష్యంగా వదిలేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై స్థానిక అధికారుల్ని కలెక్టర్ వివరణ కోరారు. స్కూల్ ఆరవణలోకి ఈ స్లిప్పులు ఎలా వచ్చాయనే అంశంపై ఆరా తీస్తున్నారు.