2022 సంవత్సరం భారత్ క్రికెట్‌కు కలసిరాలేదు. t20వరల్డ్ కప్, ఆసియా కప్‌లలో టీం ఇండియా బోల్తా పడింది. బంగ్లాదేశ్‌పై కూడా వన్డే సిరీస్ కోల్పోయింది. దీంతొ బీసీసీఐ కీలక నిర్ణయాలను తీసుకుంది. ముందుగా సెలక్షన్ కమిటీకి బీసీసీఐ అధికారులు షాక్ ఇచ్చారు. వారిపై వేటు వేసి కొత్త కమిటీకి ధరఖాస్తులు స్వీకరించారు. ఇక టీ20లకు కూడా సీనియర్లను దూరం పెట్టే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీలంకతో టీ20 సిరీస్‌కు హార్థిక్ పాండ్యాన్ కెప్టెన్‌గా అవకాశం దక్కించుకోగా..కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్‌కు విశ్రాంతి పేరుతో జట్టులో దక్కలేదు. రానున్న సిరీస్‌లోనూ హార్దిక్ కెప్టెన్‌గా కొనసాగుతాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు కోచ్ ద్రవిడ్‌ను కూడా మార్చేస్తారని వార్తలు వస్తున్నాయి.
నిజానికి వరల్డ్ కప్ ఓటమి తర్వాతే ద్రవిడ్ తొలగిస్తారని విస్తృత ప్రచారం జరిగింది. అయితే అందుకు సాహసం చేయని బీసీసీఐ ఈ సంవత్సరం వన్డే వరల్డ్ ముగిశాక ద్రవిడ్ తప్పించనున్నట్లు తెలుస్తోంది. 2022లో చేదు అనుభవాల నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. నవంబర్‌లో వన్డే ప్రపంచ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగుస్తుంది. తర్వాత అతనిని కొనసాగించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపడం లేదని కొన్ని జాతీయ వార్తా కథనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే జనవరి 1న బీసీసీఐ సమీక్షా సమావేశానికి కూడా ద్రవిడ్‌కు అహ్వానం అందలేదు అంటున్నారు.
కోచ్‌గా ద్రవిడ్ తప్పించి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను హెడ్ కోచ్‌గా నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టర్ గా విధులు లక్ష్మణ్ విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల బీసీసీఐ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ద్రవిడ్ లేని సమయంలో భారత్ జట్టుకు కోచ్‌గా లక్ష్మణ్ పలుమార్లు వ్యవహరించారు. ఐర్లాండ్‌తో జరిగిన రెండు-మ్యాచ్‌ల T20 సిరీస్‌లో VVS లక్ష్మణ్ తొలిసారిగా టీమ్ ఇండియాకు కోచ్‌గా మారాడు. జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్ సందర్భంగా వీవీఎస్ లక్ష్మణ్ పూర్తి స్థాయిలో కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆసియా కప్ 2022 సమయంలో రాహుల్ ద్రవిడ్‌కు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కొన్ని మ్యాచ్‌లకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ బాధ్యతలు నిర్వర్తించారు.
ఇవి కూడా చదవండి :
నేడు భారత్-శ్రీలంక మొదటి టీ20 మ్యాచ్
అంతరిక్షానికి చేరుకున్న సినిమా
`