నా పేరు వ్యోమమిత్ర.. తొలిసారిగా భారత్ నుంచి పైకి పోతున్నా..  - MicTv.in - Telugu News
mictv telugu

నా పేరు వ్యోమమిత్ర.. తొలిసారిగా భారత్ నుంచి పైకి పోతున్నా.. 

January 22, 2020

robo01

అంతరిక్షంలో జెండా పాతేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక ‘గగన్‌యాన్‌’ పనులను ముమ్మరం చేసింది. మన దేశం నుంచి తొలిసారి మానవుడిని రోదసీలోకి పంపే ఈ ప్రాజెక్టు సన్నాహాల్లో భాగంగా రోబో(హ్యూమనాయిడ్) సిద్ధమైంది. దీనికి ‘వ్యోమ్ మిత్ర’ అని పేరు పెట్టిన ఇస్రో ‘ఆమె’కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. 

గగన్‌యాన్‌లో భాగంగా ఈ బొమ్మను తొలుతు అంతరిక్షంలోని పంపనున్నారు. తర్వాత నలుగురు భారతీయ పురుషులను పంపుతారు. ఒక్క మహిళకు చోటు దక్కకపోవడంతో ఆ లోటును భర్తీ చేయడానికి ముందస్తుగా ఆడ హ్యూమనాయిడ్‌ను వ్యోమలోకంలోకి పంపుతున్నారు. వ్యోమ్‌మిత్ర హిందీతోపాటు ఇంగ్లిష్ లోనూ మాట్లాడుతుంది. చేతులు, కాళ్లు కదపడం, కనురెప్పలు ఆడించడం వంటి పనులన్నీ చేస్తుంది. గగన్‌యాన్ ప్రాజెక్టు విజయవంతం అయితే రోదసిలోకి మానవులను పంపిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. కొందరు భారతీయులు ఇప్పటికీ అంతరిక్షంలోకి వెళ్లినా వారు వేరే అమెరికా, రష్యా తదితర దేశాల నుంచి వెళ్లారు. 2022నాటికి మానవ సహిత రోదసి యాత్రను పూర్తి చేయాలన్న లక్ష్యంతో మొదలైన ఈ ప్రాజెక్టు కోసం రూ. 10 వేల కోట్లు కేటాయించారు.