ప్రముఖ సామాజిక వేత్త, రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య తాజా పుస్తకం ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’పై వైశ్యులు నిప్పులు చెరుగుతున్నారు. అందులో తమకు తీవ్ర అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయని, ఆ పుస్తకాన్ని నిషేధించాలని, ఐలయ్యను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు వైశ్యులు హైదరాబాద్ లో ఐలయ్య దిష్టి బొమ్మను కూడా తగబెట్టారు. అటు విజయవాడలోనూ నిరసనలు చేపట్టారు. ఆయన తమకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ పుస్తకం ఇప్పుడు రాసిం కాదని, కులాలపై అధ్యయనంలో భాగంగా ఎప్పుడో రాశానని ఐలయ్య వివరణ ఇచ్చారు. ఈ పుస్తకం రాసినందుకు తనను కొందరు ఫోన్లలో బెదిరించారని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కోమటోళ్లు రైతుల శ్రమను దోచుకుంటున్నారని ఐలయ్య పేర్కొన్నారు. సమాజంలో అతి కొంది సంఖ్యలో మాత్రమే ఉన్న వైశ్యుల దగ్గర భారీ సంపద ఉందని, వారు వ్యాపారం మానేసి సైన్యంలో పనిచేయాలని సూచించారు.