వడ్లు కొంటారా.. పారబోయమంటారా?: టీఆర్ఎస్ - MicTv.in - Telugu News
mictv telugu

వడ్లు కొంటారా.. పారబోయమంటారా?: టీఆర్ఎస్

April 4, 2022

7

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది తర్వాత మరో ఉద్యమ తెలంగాణను చూడబోతున్నాం అని ఇటీవలే టీఆర్ఎస్ మంత్రులు మీడియా వేదికగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. కేంద్రం ప్రభుత్వం వడ్లు కొంటారా లేక పారబోయమంటారా అంటూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మరికొంతమంది కార్యకర్తలు మండల కేంద్రాల్లో దీక్షలు చేస్తున్నారు. తాజాగా కేటీఆర్ ఐదంచెల యాక్షన్ ప్లాన్‌ను ప్రకటిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు మొదలైయ్యాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి వడ్లతో నిరసనలు చేస్తున్నారు. ఖమ్మంలోని మంచుకొండ ప్రధాన రహదారిపై మంత్రి పువ్వాడ అజయ్, కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ధాన్యం కొనుగోలుపై కేంద్రం దిగివచ్చే దాకా తమ పోరాటం కొనసాగుతుందని, అంతవరకూ కొట్లాడుతామని వారు స్పష్టం చేశారు.

మరోపక్క కేసీఆర్ ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో, పార్టీ ముఖ్య నేతలతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఆరోగ్య రీత్యా టెస్టులు చేయించుకొని, ప్రధాని మోదీతో కలిసి యాసంగి వడ్ల కొనుగోలుపై మాట్లాడనున్నారు.