‘బాహుబలి 3’ కోసం వెయిటింగ్ : రాజమౌళి - MicTv.in - Telugu News
mictv telugu

‘బాహుబలి 3’ కోసం వెయిటింగ్ : రాజమౌళి

March 14, 2022

01

టాలీవుడ్‌ పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసిన సినిమా బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ సత్యరాజ్ ప్రధాన పాత్రలుగా రెండు భాగాలుగా ఈ చిత్రం వచ్చింది. వసూళ్లలో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. అయితే బాహుబలి సిరీస్‌లో మూడో భాగం వస్తుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ‘బాహుబలి 3’ చేయడానికి నాకూ ఆసక్తిగా ఉంది. మా నిర్మాత శోభు కూడా సుముఖంగానే ఉన్నారు. బాహుబలి చుట్టూ జరిగే ఎన్నో విషయాలను మూడో పార్టులో చూపించాలనుకున్నాం. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. కానీ, కాస్త సమయం పడుతుంది. ఏది ఏమైనా మాహిష్మతి రాజ్యం నుంచి ఆసక్తికర వార్త వస్తుంద’ని వివరించారు. దీంతో సినీ ప్రియులు ఖుషీ అవుతున్నారు. మూడో పార్టు కోసం వెయిటింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా, రెండు పార్టులతో అనేక రికార్డులను కొల్లగొట్టిన బాహుబలి.. మూడో పార్టుతో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో వేచి చూడాలి.