Waiting For CM KCR Reaction On FarmHouse Case
mictv telugu

ఆ సమయం ఎప్పుడు వచ్చేనో..?

October 29, 2022

Waiting For CM KCR Reaction On FarmHouse Case
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. నేతలెవరూ ఫామ్‌హౌజ్ డీల్ గురించి మాట్లాడటం లేదు. ఎవరూ మాట్లాడొద్దన్న పార్టీ వర్కింగ్ కేటీఆర్ ఆర్డర్‌ని తూచ తప్పకుండా పాటిస్తున్నారు. బీజేపీ విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారేగానీ కేసు డీటైల్స్ పై ఓపెన్ కావడం లేదు. సమమం వచ్చినప్పుడు సీఎం కేసీఆరే అన్ని విషయాలు వెల్లడిస్తామని కేటీఆర్ అన్నారు. ఆ సమయం ఎప్పుడు వస్తోంది.?అదను చూసి కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారా?

వ్యూహాత్మక మౌనమేనా?

రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ ఎపిసోడ్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటిదాకా మాట్లాడలేదు. ప్రగతిభవన్‌లో ఆ నలుగురు ఎమ్మెల్యేలతో చర్చించినట్లు తెలుస్తోంది. అసలేం ఏం జరిగిందో తెలుసుకున్నట్లు ప్రచారం సాగింది. ఎమ్మెల్యేల ఎర కేసు విచారణపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడతారని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు అది జరగలేదు. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ శనివారం క్లారిటీ ఇచ్చేశారు.సీఎం కేసీఆర్ సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతారని అన్నారు. కేసు దర్యాప్తు జరుగుతుందని, నేతలు ఎవరూ మాట్లాడొద్దని ఇప్పటికే సూచించామన్నారు. దొంగ ఎవరో,దొర ఎవరో ఇప్పటికే జనానికి తెలిసిపోయిందన్నారు.

ఆ సమయం ఎప్పుడు?

ముఖ్యమంత్రి రియాక్షన్ కోసం రాష్ట్రమే కాదు దేశమంతా ఎదురుచూస్తోంది. ఫామ్‌హౌజ్ ఎపిసోడ్ పై అసలు విషయాలు వెల్లడిస్తారని ఆశిస్తున్నారు. కేంద్రంపై కేసీఆర్ స్టయిల్ ఎటాక్ ఎలా ఉండబోతుందని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో సునామీ సృష్టించిన అంశం కదా.పొద్దున లేస్తే టీవీల్లో, పేపర్లల్లో, నెట్‌లో ఇవే వార్తలు కనిపిస్తున్నాయి. ఏ నలుగురు కలిసినా దీనిపైనే చర్చించుకుంటున్నారు. కేసు ఏ మలుపు తిరుగుతుందోనని ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.

ఇక సారు దూకుడే

ఎమ్మెల్యేలకు ఎర కేసు టీఆర్ఎస్‌కు బ్రహ్మాస్త్రంగా మారింది. ప్రత్యర్థి పార్టీని ఓ ఆట ఆడేసుకుంటోంది. గల్లీ నుంచి ఢిల్లీదాకా..ఎవరి స్లైల్లో వారు. కేసు పూర్వపరాల్లోకి వెళ్లకుండానే బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. గులాబీ నేతలెవ్వరూ గీత దాటడం లేదు. తమ పార్టీ నేతలు లిమిట్స్ లో ఉంటూనే ఉతికిఆరేస్తున్నారని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. పెద్దసార్ ఇక కేంద్రాన్ని ఓ ఆట ఆడుకుంటారని మాట్లాడుకుంటున్నారు. ఇన్నాళ్లూ ఇబ్బంది పెట్టిన కేంద్రం పనిచూస్తారని చర్చించుకుంటున్నారు.