వీడియో : బీర్ల మూతలు ఇలా కూడా తీస్తారా.. యువతి స్కిల్ షో - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో : బీర్ల మూతలు ఇలా కూడా తీస్తారా.. యువతి స్కిల్ షో

May 16, 2022

 

మనం చేసే పనులు సాధారణమేనవే ఉన్నా.. ఆ పని చేసే విధానంలో ప్రత్యేకత ఆయా వ్యక్తులకు గౌరవాన్ని తెచ్చిపెడతాయి. వీటికి చాలా ఉదాహరణలు మన చుట్టూ చాలా కనిపిస్తాయి. వీటికి చదువుతో పని ఉండదు. కేవలం వ్యక్తుల ఆసక్తి, అభిరుచులతోటి మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇందులో బారులో వెయిట్రెస్‌గా పనిచేసే ఓ చైనా యువతి మెరుపు వేగంతో బీరుబాటిళ్ల మూతలు తీస్తోంది. ఎంతలా అంటే బీర్లు రెగ్యులర్‌గా తీసుకునే మగమహారాజులు కూడా కనిపెట్టలేనంతగా. ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది. అందరూ కూడా యువతి స్కిల్‌ను మెచ్చుకుంటూ కామెంట్లు రాస్తున్నారు. మన వద్ద కేసులకు కేసులు లాగించే మగవాళ్లుకు కూడా సాధ్యమవనంత రీతిలో మూతలు తీస్తున్న యువతిని అందరూ ప్రశంసిస్తున్నారు.